జూటా మాటలు బంద్ చెయ్యి.. అది నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. నీవు ఎంపీకి రాజీనామా చేస్తావా అరవింద్..
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రూ.9 కోట్ల విలువైన రోడ్డు పనులకు రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రూ.9 కోట్ల విలువైన రోడ్డు పనులకు రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాల్లో రోడ్ల రూపురేఖలు మారిపోయాయని మంత్రి అన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పల్లెలు ప్రగతి పథం లో ముందుకెళ్తున్నాయని మంత్రి వివరించారు. జూటా మాటల బీజేపీ ఎంపీ అరవింద్ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారం చేస్తాడని విమర్శించారు. రాష్ట్రంలో ఇస్తున్న ఆసరా పెన్షన్‌లలో కేంద్ర ప్రభుత్వం రెండువందల కు మించి ఒక్కరూపాయి ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజినామా చేస్తా ..లేదంటే అరవింద్ ఎంపీ పదవికి రాజినామా చేస్తావా అంటూ వేముల సవాల్ విసిరారు.
ఇలాంటి తప్పుడు ప్రచారంపై చర్చ జరగాలి, ప్రజలు వాస్తవాలను గ్రహించాలని మంత్రి వేముల కోరారు. బీజేపీ నేతలు అసత్యాలను, అవాస్తవాలను ప్రచారం చెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణాలకోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం 4 లక్షల 32 వేలు ఇస్తుంటే, కేంద్రం ఇచ్చేది కేవలం 72 వేలు మాత్రమేనని వివరించారు.
కల్యాణ లక్ష్మీ డబ్బులో ఒక్క రూపాయి కుడా కేంద్రప్రభుత్వం ఇవ్వటం లేదని మంత్రి వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎంఆర్ఎఫ్ లాగా పీఎం ఆర్ఎఫ్ కూడా ఉంటది..దానిలోంచి పేదల హాస్పిటల్ ఖర్చులకు సహాయం అందించాలంటే బీజేపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదని అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంతో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిపథంలో ముందుకెళుతోంది. బీజేపీ నేతలు ఇప్పటికైనా పద్దతి మార్చుకుని నిర్మాణాత్మక విమర్శలు చెయాలి. పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి కేంద్రం పైసలు ఇస్తుంది. తెలంగాణకు ఏమీ చేయరు. చేసే కేసీఆర్ ను ఏక వచనంతో విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీ తండ్రి వయసున్న కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు సంస్కారం లేకుండా మాట్లాడతావా అంటూ ఎంపీ అరవింద్‌ను ప్రశ్నించారు. నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించి, కేంద్రం నుండి నిదులు తెప్పించాలి. అంతేగాని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం సరి కాదని హితవు పలికారు.
బాల్కొండ ప్రజల కోసం బరాబర్ కాళ్లు మొక్కుతా
నన్ను సీఎం కేసీఆర్ తన కన్న కొడుకులాగా చూసుకుంటాడు. నా తండ్రి సమానమైన కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా. నా బాల్కొండ ప్రజల కోసం కప్పలవాగు మీద 18 చెక్ డ్యామ్ లకు రూ.100 కోట్లు ఇచ్చారు. ఆ సాగునీటితో ఇవాళ రైతన్నలు సంతోషంగా ఉన్నారు. నా రైతన్నల కోసం ఇంత చేసిన కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు.. ప్రతీసారి మొక్కుతానని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
మొదలు మీ నాన్నను అడుగు.. మనకన్నా వయసులో పెద్దవాళ్ల కాళ్లు మొక్కితే తప్పా అని.. బాల్కొండ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకోసం పాదాబివందనం తప్పకుండా చెస్తాను .అందులో ఏం తప్పుందని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలే తప్ప.. సంస్కార హీనులుగా మాట్లాడొద్దని బండి సంజయ్, ఎంపి ఆరవింద్ కు సూచించారు. బండి సంజయ్, అర్వింద్‌లు తమ పరిధి దాటి మాట్లాడొద్దని మంత్రి హెచ్చరించారు.