చంద్రబాబుకు ఉన్న ఏకైక బలం నిమ్మగడ్డే.. పంచాయతీ ఎన్నికలు రాగానే ప్రజా సమస్యలు గుర్తొచ్చాయా -అమర్‌నాథ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ఆపడానికి అధికార పక్షం ప్రయత్నించగా.. ఎన్నికలు జరిపేందుకు ప్రతిపక్షం పావులు కదిపిన విషయం

  • K Sammaiah
  • Publish Date - 5:21 pm, Fri, 29 January 21
చంద్రబాబుకు ఉన్న ఏకైక బలం నిమ్మగడ్డే.. పంచాయతీ ఎన్నికలు రాగానే ప్రజా సమస్యలు గుర్తొచ్చాయా -అమర్‌నాథ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ఆపడానికి అధికార పక్షం ప్రయత్నించగా.. ఎన్నికలు జరిపేందుకు ప్రతిపక్షం పావులు కదిపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ప్రజాబలం లేదని ఉన్న ఏకైక బలం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ మాత్రమేనన్నారు వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలు పరిష్కరించలేని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా చేయగలరని ప్రశ్నించారు.

పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడాన్ని అమర్‌నాథ్‌రెడ్డి తప్పుపట్టారు. పంచాయతీ ఎన్నికలు వచ్చాక ప్రజాసమస్యలు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. 2014 మేనిఫెస్టో ఒకసారి ప్రజలకు చూపించాలని ఆయన టీడీపీని ప్రశ్నించారు.