AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..?

జీడిపప్పులో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, విటమిన్ K, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఎముకలను బలంగా ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇప్పుడు జీడిపప్పు తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజూ జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..?
Cashew Nuts Health Benefits
Prashanthi V
|

Updated on: Mar 22, 2025 | 5:47 PM

Share

జీడిపప్పు.. చిన్న పిల్లల నుండి పెద్దవారిదాకా చాలా మంది దీనిని ఇష్టపడతారు. అయితే కేవలం రుచికోసమే కాకుండా ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి కూడా మేలు చేస్తుంది. జీడిపప్పులో మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటుంది. ఇది కండరాలను నిశ్చలంగా ఉంచే గుణాన్ని కలిగి ఉండటంతో పాటు నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటుంది. శరీరంలో అలసటను తగ్గించి శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.

జీడిపప్పులో జింక్ ఎక్కువగా ఉండటంతో ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి సహజ కాంతిని అందించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

జీడిపప్పులో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గిపోతే అలసట, నీరసం, చర్మం రంగు మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఐరన్ కొరత లేకుండా ఉండటానికి జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

జీడిపప్పులో కాపర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో కాపర్ స్థాయి తగ్గిపోతే ఎముకలు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని తినడం ద్వారా ఎముకల దృఢత్వాన్ని పెంచుకోవచ్చు.

జీడిపప్పులో గుండెకు మేలు చేసే సహజ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరచి మానసిక శక్తిని పెంచుతాయి.

జీడిపప్పులో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచి ఎముకలు బలహీనపడకుండా రక్షించే శక్తిని కలిగి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు నాజూకుగా మారకుండా ఉండేందుకు విటమిన్ K తగిన మోతాదులో ఉండటం అవసరం.

జీడిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కండరాల పెరుగుదల కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఆకలి నియంత్రణలోనూ సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీరాన్ని అందుకోవాలనుకునే వారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

జీడిపప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేసి అజీర్తి, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగించగలదు. శరీరంలోని వ్యర్థాలను సులభంగా బయటకు పంపేందుకు కూడా ఇది సహాయపడుతుంది.