Viral News: ప్రియురాలి పెళ్లికి హాజరైన మాజీ ప్రియుడు.. స్టేజీ మీదకు రాగానే ఆ వధువు ఏం చేసిందంటే..
Viral News: ఇండోనేషియాలోని జకర్తాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన పెళ్లికి హాజరైన మాజీ ప్రియుడిని స్టేజీ పైనే కౌగిలించుకుంది..

Viral News: ఇండోనేషియాలోని జకర్తాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన పెళ్లికి హాజరైన మాజీ ప్రియుడిని స్టేజీ పైనే కౌగిలించుకుంది వధువు. దీనికి వరుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అసలేం జరిగిందంటే.. ఇండోనేషియాలో ఓ జంట వివాహం జరిగింది. ఆ వివాహానికి వధువు మాజీ ప్రియుడు కూడా హాజరయ్యాడు. ఆ సందర్భంగా సదరు యువకుడు వధువరులిద్దరికీ విషెస్ చెప్పడానికి స్టేజీ పైకి వెళ్లాడు. అయితే మాజీ ప్రియుడిని చూసిన వధువు పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. అంతేకాదు.. ఆ యువకుడిని వరుడికి పరిచయం చేసింది. అతడిని కౌగిలించుకునేందుకు వరుడి పర్మిషన్ కూడా తీసుకుంది. వరుడు కూడా ఓకే అనడంతో వధువు తన మాజీ ప్రియుడిని హగ్ చేసుకుంది.
అనంతరం ఆ యువకుడు వరుడికి కూడా విషెష్ చెప్పాడు. వరుడు కూడా అతన్ని హగ్ చేసుకున్నాడు. అయితే, ఈ ఘటన తాలూకు వివరాలు వెల్లడిస్తూ వీడియోను వధువు టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో కాస్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వరుడు మెచ్చూరిటీ లెవెల్స్‌కి కొందరు హ్యాట్సాప్ అంటుంటే.. వధువు అలా చేసి ఉండాల్సింది కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also read:
Donations for Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీగా విరాళమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్..