TMC MLA Resigned: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు.. గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే..
TMC MLA Resigned: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

TMC MLA Resigned: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన రాజీనామా లేఖను రాష్ట్ర శాసనసభ స్పీకర్ బిమన్ బెనర్జికి అందజేశారు. కాగా, జనవరి 22న తన మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజీవ్ బెనర్జీ, తాజాగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేశారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాజీవ్ బెనర్జీ.. ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీ సభ్యత్వానికి రాజీమా చేయడం లేదని చెప్పారు. అయితే, ఆ కార్యక్రమం కూడా రేపో మాపో జరిగిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే, త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కాగా, టీఎంసీ కీలక నేత సువెందు అధికారి రాజీనామా చేయడం మొదలు.. పశ్చిమబెంగాల్‌లో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా రాజీవ్ బెనర్జీ రాజీనామాతో ఇప్పటి వరకు రాజీనామా చేసిన టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య 12 మందికి చేరింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలంతా ఇలా వరుస షాక్‌లు ఇస్తుండటంతో టీఎంసీ అధిష్టానం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓవైపు కొందరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదంటూ టీఎంసీ ముఖ్యులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం వారిలో అలజడి కనిపిస్తూనే ఉంది. అయితే, టీఎంసీలో సువెంధు అధికారి తరువాత అంతటి ప్రజాధరణ కలిగిన రాజీవ్ బెనర్జీ అని చెప్పాలి. అలాంటి నేత టీఎంసీని వీడటం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని రాజకీయ వర్గాల టాక్.
Also read:
Donations for Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీగా విరాళమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్..