Soyam Bapu Rao: పార్టీ మారుతున్నాననే ప్రచారంపై స్పందించిన బీజేపీ ఎంపీ సోయం బాపూరావు.. ఏం అన్నారంటే
తాను పార్టీ మారిపోతున్నట్లు వస్తున్న ప్రచారంపై బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను కొట్టిపారేశారు. అసత్యాలను చెప్పడంపై మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.
తాను పార్టీ మారిపోతున్నట్లు వస్తున్న ప్రచారంపై బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను కొట్టిపారేశారు. అసత్యాలను చెప్పడంపై మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. అయితే ఈ నెల 27న తన కుమారుడి పెళ్లి ఉందని తెలిపారు. పార్టీలకతీతంగా పెళ్లి కార్డులు అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కూడా పెళ్లి పత్రిక ఇస్తానని తెలిపారు.
అలాగే గతంలో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి తానే ఆహ్వానించానని తెలిపారు. ఆయనతో విభేదాలు ఏం లేవని పేర్కొన్నారు. తనపై వస్తున్న ఈ తప్పుడు ప్రచారాల వెనుక భారాస హస్తం ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు చేశారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదంటూ హితవు పలికారు. అక్కడ బీజేపీ ఓడిపోయినప్పటికీ ఓట్ల శాతం మాత్రం తగ్గలేదని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..