Etela Rajender: BRSతో తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

|

Oct 05, 2022 | 3:03 PM

టీఆర్ఎస్ పార్టీ పేరును BRS గా మార్చడంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు కేసిఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని తెలిపారు.

Etela Rajender: BRSతో తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
Etela Rajender
Follow us on

తెలంగాణ ఆవిర్భావం కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ.. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ బుధవారం కీలక ప్రకటన చేశారు. కాగా.. టీఆర్ఎస్ పార్టీ పేరును BRS గా మార్చడంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు కేసిఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని తెలిపారు. ఉద్యమ పార్టీని ఖతం చేసి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కేసిఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని విమర్శించారు. ఆ పార్టీ స్థాపనతోనే తెలంగాణాకి కెసిఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందన్నారు. తెలంగాణా ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం కూడా తెగిపోయిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని పేర్కొన్నారు.

కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తరువాత ఆయన నమ్ముకుంది మద్యాన్ని, డబ్బుని ప్రలోభాలను అంటూ విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని పగటికల కంటున్నారని… అది కలగా మిగిలిపోతుందంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీయడానికి పోయినట్టు ఉందంటూ విమర్శించారు.

తెలంగానలోనున్న సమస్యలు పరిష్కరించలేనివారు.. అనేక రకాల ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆ సంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ కెసిఆర్ పై మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి