AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: కేసీఆర్‌ ఆదిపురుష్‌.. కొత్త పార్టీపై సంచలన ట్విట్‌ చేసిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ

తెలంగాణలో రాజకీయాల రచ్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త పార్టీకి పురుడు పోశారు. తనదైన శైలితో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

Ram Gopal Varma: కేసీఆర్‌ ఆదిపురుష్‌.. కొత్త పార్టీపై సంచలన ట్విట్‌ చేసిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ
Ram Gopal Varma
Subhash Goud
|

Updated on: Oct 05, 2022 | 3:03 PM

Share

తెలంగాణలో రాజకీయాల రచ్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త పార్టీకి పురుడు పోశారు. తనదైన శైలితో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకు కొత్త పార్టీని ప్రకటించారు. దసరా రోజున బీఆర్‌ఎస్‌ పార్టీగా ప్రకటిస్తూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కొత్త పార్టీపై పలువురు రాజకీయ నేతలు, ఇతరులు స్పందిస్తున్నారు. అలాగే టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ఆయన ఏదీ మాట్లాడిన సంచలనమే. ఎప్పుడు ట్విట్టర్‌లో ఏదో ఒక అంశంపై ట్విట్‌ చేస్తుంటారు వర్మ. ట్విట్టర్‌లో ఎక్కువగా స్పందించి ఆయన.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ను తొలి ఆదిపురుష్‌ అయ్యాడంటూ ట్విట్‌ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న కేసీఆర్‌కు స్వాగతం పలికారు రాంగోపాల్‌ వర్మ. అయితే వర్మ కేసీఆర్‌ను ఆదిపురుష్‌గా అభివర్ణించడంతో కొందరు నెటిజన్లు పొడుగుడున్నారా…? లేక విమర్శిస్తున్నారా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. కేసీఆర్‌ చార్టర్డ్‌ విమానంలో ఈ సాయంత్రమే.. వీరు ఢిల్లీ వెళ్తారు.. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!