సాగర్ అభివృద్ధికి బీజేపీ స్పెషల్ మేనిఫెస్టో.. అభ్యర్థి రవికుమార్‌తో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దూకుడు

Nagarjuna Sagar By Election : నాగార్జున సాగర్‌లో అభ్యర్థి ప్రకటనకు ముందు టెంపో మెయింటెన్‌ చేసింది బీజేపీ.

సాగర్ అభివృద్ధికి బీజేపీ స్పెషల్ మేనిఫెస్టో.. అభ్యర్థి రవికుమార్‌తో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దూకుడు
Kishan
Follow us

|

Updated on: Apr 10, 2021 | 11:33 PM

Nagarjuna Sagar By Election : నాగార్జున సాగర్‌లో అభ్యర్థి ప్రకటనకు ముందు టెంపో మెయింటెన్‌ చేసింది బీజేపీ. టీఆర్‌ఎస్‌ క్యాండేట్‌ ప్రకటన దాకా తన అభ్యర్థెవరో తేల్చకుండా వ్యూహాత్మకంగా ఎదురు చూసింది. చివరికి సామాజిక సమీకరణాలతో లంబాడా అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్‌ రవికుమార్‌ని బరిలోకి దించింది. అప్పటిదాకా టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు కొందరు అలిగినా.. కండువాలు మార్చినా .. లైట్‌ తీసుకుంది కమలం పార్టీ. నామినేషన్‌ వేసినప్పట్నించీ దాదాపు వారం పదిరోజులు.. సాగర్‌లో సింగిల్‌గానే ప్రచారం చేసుకున్నారు బీజేపీ క్యాండేట్‌. స్టార్‌ క్యాంపెయినర్లని ప్రకటించినా ప్రచారానికి ఎవరూ రాలేదు. దీంతో దుబ్బాక ఎన్నికలా సాగర్‌ని బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న చర్చ జరిగింది. అయితే మా వ్యూహం మాకుందంటూ ఎన్నికకు వారం ముందు అమ్ములపొదిలోంచి అస్త్రాలు బయటికి తీసింది బీజేపీ. బైపోల్‌కి కూడా మ్యానిఫెస్టోని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాగర్ అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోను హాలియాలో విడుదల చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌పాలనలో సాగర్‌ అభివృద్ధి జరగలేదంటూ… తమ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పుకొచ్చారు. కేంద్రీయ విద్యాలయంనుంచి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ దాకా సాగర్‌ ప్రజలకు ఎన్నో హామీలిస్తోంది బీజేపీ. మూడు పార్టీల్ని చూశారు…మాకో అవకాశం ఇవ్వండంటూ ప్రజల్లోకెళ్తోంది. సాగర్‌లో బీజేపీ అభ్యర్థి రవికుమార్‌తో కలిసి ప్రచారం చేశారు కిషన్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ల వైఫల్యాలపై ఇప్పటికే చార్జిషీట్‌ వెల్లడిచేసింది కమలం పార్టీ. ఇప్పుడు మేనిఫెస్టోతో ఒక్కసారిగా దూకుడు పెంచింది.

సాగర్‌లో అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని జానారెడ్డి ప్రచారం చేస్తుంటే… ఆయన చేసిందేమీ లేదంటూ టీఆర్‌ఎస్‌ జనంలోకెళ్తోంది. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ మోస్ట్ జానారెడ్డి క్రీజ్‌లో ఉంటే… టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తయినా గులాబీపార్టీ టీం అంతా గ్రౌండ్‌లోకి దిగింది. ఈ టైంలో తమకో అవకాశమిస్తే ఏం చేస్తామో మాటలతో కాకుండా.. మేనిఫెస్టో రూపంలో ప్రకటించి కొత్త ఒరవడి సృష్టించింది బీజేపీ. ముఖ్యనేతల్ని రంగంలోకి దించి.. లేటయినా లేటెస్ట్‌గా ప్రచారాన్ని హోరెత్తించాలనుకుంటోంది కేంద్రంలోని అధికారపార్టీ.

Read also : విజయవాడలో ఘోరం, తండ్రి(38).. కూతురు(10) ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య.. ‘ఐ నీడ్‌…’ అంటూ గోడపై రాతలు

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు