Telangana: బీఆర్ఎస్‌పై కొనసాగుతున్న బీజేపీ నేతల కామెంట్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్, తరుణ్ చుగ్..

|

Oct 08, 2022 | 8:59 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర నేతల మొదలుకొని, కేంద్రంలోని పెద్దలు..

Telangana: బీఆర్ఎస్‌పై కొనసాగుతున్న బీజేపీ నేతల కామెంట్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్, తరుణ్ చుగ్..
Bjp Vs Trs
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర నేతల మొదలుకొని, కేంద్రంలోని పెద్దలు సైతం బీఆర్ఎస్‌పై స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రమైన కామెంట్స్ చేశారు. మాంత్రికులు చెప్పిన కారణంగానే.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారని ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఇక బీఆర్ఎస్‌పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా స్పందించారు. పార్టీ పేరు మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కదని ఎవరో తాంత్రికుడు సీఎం కేసీఆర్ కు చెప్పారని తరుణ్‌ చుగ్‌ విమర్శించారు. ఆ మాటలు వినే పార్టీ పేరు మార్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గద్దె దిగడం ఖాయమని జోస్యం చెప్పారాయన. కాంగ్రెస్‌ ఒక ఎక్స్‌పైరీ అయిన ఇంజెక్షన్‌ వంటిదని తెలిపారు. బీజేపీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన తరుణ్‌ చుగ్‌ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారాయన.

బీఆర్ఎస్‌పై నిర్మల రియాక్షన్..

భారత్‌ రాష్ట్ర సమితి అని పేరు మార్చుకొని తెలంగాణను, తెలుగును టీఆర్ఎస్ పార్టీ వదిలేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, మహిళలు, కులం అని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినా టీఆర్ఎస్ సర్కారు ఏం చేయలేకపోయిందని విమర్శించారు కేంద్రమంత్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..