Telangana: రంగనాథ్‌ ఐపీఎస్ ఆఫీసరా, రాజకీయ నాయకుడా?.. మండిపడ్డ మహేశ్వర్ రెడ్డి

|

Aug 29, 2024 | 5:33 PM

హైడ్రా విషయంలో బీజేపీ యాజ్‌యూజ్‌వల్‌ పార్టీ మార్క్ చూపించింది. హైడ్రా పేరుతో కేవలం హిందువుల ఆస్తులనే కూల్చుతున్నారు అంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Telangana: రంగనాథ్‌ ఐపీఎస్ ఆఫీసరా, రాజకీయ నాయకుడా?.. మండిపడ్డ మహేశ్వర్ రెడ్డి
Maheswar Reddy
Follow us on

దుర్గం చెరువు పరిధిలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చింది హైడ్రా. అయితే అదే హైడ్రాకు ఇటు బీఆర్ఎస్, అటు ఎంఐఎం, మరోవైపు బీజేపీ వేస్తున్న ప్రశ్నలకు కమిషనర్‌ రంగనాథ్ ఏం సమాధానం చెబుతారా అనే పరిస్థితిని తీసుకొచ్చింది.

ఇక హైడ్రా విషయంలో బీజేపీ యాజ్‌యూజ్‌వల్‌ పార్టీ మార్క్ చూపించింది. హైడ్రా పేరుతో కేవలం హిందువుల ఆస్తులనే కూల్చుతున్నారు అంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ముస్లింల ఆస్తుల జోలికి వెళ్లే దమ్ము లేదా, ఎవరు ఆపుతున్నారంటూ మహేశ్వర్‌రెడ్డి హైడ్ర తీరుపై మండిపడ్డారు. రంగనాథ్‌ ఐపీఎస్ ఆఫీసరా, రాజకీయ నాయకుడా? ఆసక్తి ఉంటే ఖాకీ వదలి, ఖద్దర్ వేసుకోవాలంటూ హితవు పలికారు మహేశ్వర్ రెడ్డి. రంగనాథ్‌కి పనితక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ. హైడ్రా పేరుతో వసూళ్లు నిజమా, అబద్దమా? అంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నల వర్షం సంధించారు.

సల్కం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజేశ్వర్ రెడ్డికి వర్తించవా..? అంటూ ఎదురుదాడికి దిగారు మహేశ్వర్ రెడ్డి. ఓవైసీకీ ఆరు నెలలు సమయం ఇస్తున్నప్పుడు, మిగితా వారికి ఎందుకు సమయం ఇవ్వలేదన్నారు. ఎన్ కన్వెన్షన్ కు ఎందుకు సమయం ఇవ్వలేదన్న ఆయన.. ఓల్డ్ సిటీలోకి వెళ్ళే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు. కేవలం కొందరిని మాత్రమే టార్గెట్ చేసి నిర్మాణాలను కూల్చేస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్న మహేశ్వర్ రెడ్డి. వంద శాతం చెరువు కబ్జా అయితే ముట్టుకోమని రంగనాథ్ చెబుతున్నారన్నారు. కాగా, తీవ్రవాదులను, టెర్రరిస్టులతో పోరాడిన పోలీస్ అధికారులకు లేని సెక్యూరిటీ, రంగనాథ్ కు ఎందుకు..? అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేయడం మంచికాదన్నారు.

వీడియో చూడండి.. 

ఇదిలావుంటే, ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ ఆస్తులకు నోటీసులు ఇచ్చినంతసేపూ అది ఫక్తు రాజకీయ కక్షసాధింపుగానే వ్యవహారం నడిచింది. ఇప్పుడు పేదలకు, మధ్యతరగతి వాళ్లకు నోటీసులు అందుతుంటే అసలు సిసలు ప్రజా రాజకీయం మొదలవుతోంది. తాజాగా ఓల్డ్‌ బోయిన్‌పల్లి పరిధిలోని హస్మత్‌పేట చెరువున కబ్జా చేశారంటూ.. 120 కుటుంబాలకు నోటీసులు ఇచ్చారు రెవిన్యూ అధికారులు. వారంలో ఇళ్లు ఖాళీ చేయాలన్నది ఆ నోటీసుల్లో వార్నింగ్‌. ఇదిగో మీకు గిఫ్ట్‌లు వచ్చాయంటూ నవ్వుతూ నోటీసులు పంచారన్నది ఆ 120కుటుంబాల ఆవేదన. 40ఏళ్లుగా ఉంటున్న మాకు నోటీసులు ఇస్తారా, వాపస్‌ తీసుకోకపోతే విషం తాగి చస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు కాలనీ వాసులు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ భరోసా ఇచ్చారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హైడ్రాను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఈటల.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..