Telangana: బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?

బీజేపీకి బూత్ కమిటీలు అనేవి బలం. మరి ఆ కమిటీలే సరిగా పనిచేయకపోతే పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఈ విషయంలోనే ఆ పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. క్షేత్ర స్థాయి నుండి వచ్చిన వివరాలు క్రాస్ చెక్ చేస్తే చాలా చోట్ల ఆ వివరాలు డోల్లేనని తేలింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న బూత్ కమిటీల పై ఆ పార్టీ దృష్టి పెట్టల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం బీజేపీ పోలింగ్ బూత్ కమిటీలు...సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.

Telangana: బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?
BJP
Follow us

| Edited By: Aravind B

Updated on: Sep 24, 2023 | 4:14 PM

బీజేపీకి బూత్ కమిటీలు అనేవి బలం. మరి ఆ కమిటీలే సరిగా పనిచేయకపోతే పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఈ విషయంలోనే ఆ పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. క్షేత్ర స్థాయి నుండి వచ్చిన వివరాలు క్రాస్ చెక్ చేస్తే చాలా చోట్ల ఆ వివరాలు డోల్లేనని తేలింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న బూత్ కమిటీల పై ఆ పార్టీ దృష్టి పెట్టల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం బీజేపీ పోలింగ్ బూత్ కమిటీలు…సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. పోలింగ్ బూత్ గెలిస్తే ఆ ఎన్నిక గెలిచినట్టేనని ఆ పార్టీ లైన్. ఆ పార్టీ కార్యక్రమాలు పోలింగ్ బూత్ కేంద్రంగానే జరుగుతాయి. తెలంగాణలో కూడా గత కొన్ని నెలలుగా బూత్ కమిటీలు వేయడం, వాళ్ళ వివరాలు రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 35 వేలకు పైగా పోలింగ్ బూత్‎లు ఉంటే బీజేపీ 24 వేల పోలింగ్ బూత్‎లలో కమిటీలు వేసింది.

అయితే ఈ కమిటీల విషయంలో బీజేపీకి వచ్చిన ఫీడ్‌బ్యాక్ దిమ్మతిరిగేలా కనిపిస్తోంది. వచ్చిన డాటాను క్రాస్ చెక్ చేస్తే చాలాచోట్ల పోలింగ్ బూత్ అధ్యక్షులు లేరని తెలిసింది. వచ్చిన పేర్లలో చాలామంది ప్రస్తుతం యాక్టివ్‌గా లేకపోవడమో అసలు పార్టీలో లేని వారివి ఉన్నాయట. అంతేకాదు ఫోన్ చేస్తే కూడా ఎలాంటి స్పందన రావడం లేదట. ఇటీవల వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు బూత్ కమిటీలు లేని విషయం స్పష్టంగా కనిపించడంతో షాక్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక బూత్ కమిటీలు డొల్ల అనే క్లారిటీకి పార్టీ పెద్దలు వచ్చారు. దీంతో పార్టీ హై కమాండ్ అప్రమత్తమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలతో ఈ విషయంపై చాలా సీరియస్‎గా మాట్లాడారు.

అలాగే రాజకీయ కార్యక్రమాలను తగ్గించి సంస్థాగత విషయాలపై దృష్టి పెట్టాలని గట్టిగానే చెప్పారు. యాక్టివ్‌గా లేని చోట కొత్తవారిని నియమించాలని అవసరమైతే మండల అధ్యక్షులను కూడా మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో చివరి సారిగా చెక్ చేసేందుకు రెండు మండలాల కు ఒకరికి బాధ్యతలు ఇచ్చింది పార్టీ. 450 మందిని సెలక్ట్ చేసింది. ఈ నెల 26 నుండి వచ్చే నెల రెండు వరకు వారికి అప్పగించిన మండలాలలో బూత్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడా ,కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర ఇంఛార్జి ఉన్నాడా.. మండల కమిటీ ఉందా అనే విషయాలను పరిశీలించనున్నారు. రాష్ట్ర పార్టీ ఇచ్చే ప్రో ఫార్మా ప్రకారం రిపోర్ట్ తయారు చేసి పంపించనున్నారు. మరి వచ్చే రిపోర్ట్ ఆధారంగా సునీల్ బన్సల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు