Telangana: మోదీని పెద్దన్న అంటున్న రేవంత్.. బీజేపీ, కాంగ్రెస్ బంధం బట్టబయలైందన్న BRS
తెలంగాణ రాజకీయాల్లో బడేభాయ్ చోటే భాయ్ ముచ్చట... హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనతో.. మొత్తంగా పొలిటికల్ సీన్ మారేట్టు కనిపిస్తోంది. అధికారిక కార్యక్రమంలో అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. బడేబాయ్ అని రేవంత్ అంటే... కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు ఎక్కుపెట్టారు మోదీ. మరోవైపు, జాతీయ పార్టీల దోస్తీ బయటపడిందని ఆరోపిస్తోంది బీఆర్‌ఎస్.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిరోజు పర్యటన… రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానితో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్… మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశప్రధాని తమకు పెద్దన్నలాంటి వారంటూ.. ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్.. ఇప్పుడు పొలిటికల్‌గా అగ్గిరాజేశాయి.
అయితే, రేవంత్ అలా పొగిడి వెళ్లారో లేదో … ఆ కొద్దిసేపటికే ఆదిలాబాద్ బహిరంగసభలో కాంగ్రెస్‌ను ఏకిపారేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూదొందేనంటూ… ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ రాకతో తెలంగాణలో జరిగే మార్పేమీ ఉండబోదన్నారు.
ప్రధాని మోదీని బడేభాయ్ అంటూ సంబోధించిన రేవంత్‌పై.. బీఆర్‌ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. కేంద్రవిధానాల్ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే.. ఇక్కడ రేవంత్ మాత్రం పొగిడేస్తు్న్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్, బీజేపీల బంధం… రేవంత్ వ్యాఖ్యలతో బట్టబయలైందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత.
మరి, మరో రోజు ప్రధాన పర్యటన మిగిలి ఉండగానే.. ఈ స్థాయిలో రాజకీయ వేడి రగిలింది. రెండో రోజు తర్వాత.. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…