Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడి పంతులు అవతారమెత్తిన ఐటీడీఏ పీవో.. విద్యార్థుల భవిష్యత్‌కు చేయూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్. మొదటగా చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో తనిఖీ నిర్వహించిన ఆయన ఉపాధ్యాయుల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండి, పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.

బడి పంతులు అవతారమెత్తిన ఐటీడీఏ పీవో.. విద్యార్థుల భవిష్యత్‌కు చేయూత
Itda Po Rural
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 29, 2025 | 3:56 PM

ఐఏఎస్ లు అంటే కార్యాలయాలకు పరిమితమయ్యేవారు గతంలో కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు ఐఏఎస్ లు, క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు నిత్యం పర్యటనలు చేస్తున్నారు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ పీవో లు గా విధులు నిర్వహించే ఐఏఎస్ లు పాలనపరంగా గిరిజనులతో మమేకం అవ్వాలి అప్పుడే వారి సాధకబాధకులు తెలుస్తుంటాయి, గతంలో కొందరు కార్యాలయాలకే పరిమితమవగా మరికొందరు తమ మార్కు చూపించి గిరిజనుల మననాలు పొందారు, ఆకోవకు చెందిన వ్యక్తి ప్రస్తుతం భద్రాచలం ఐటిడిఏ పిఓగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ కూడా.. నిత్యం ప్రజల్లో తిరుగుతూ క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంతాలను పర్యవేక్షిస్తూ వారికి ఆర్థిక స్వాలంబన కలిగించేందుకు తన ఆలోచనలకు పందును పెడుతున్నారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్. మొదటగా చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో తనిఖీ నిర్వహించిన ఆయన ఉపాధ్యాయుల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండి, పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకున్న పిఓ వచ్చే ఎండాకాలంలో డైనింగ్ హాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు.

అనంతరం వట్టం వారి గుంపులోని మరో గిరిజన పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారితో కలిసి కూర్చుని బోర్డులపై రాయిస్తూ పాఠాలు ఎలా నేర్చుకోవాలో సూచించారు. వారితో ముచ్చటిస్తూ విద్యే మన తలరాతను మారుస్తుందని మంచిగా చదువుకోవాలని జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…