నిర్మల జిల్లా వాసులను పెద్ద హడలెత్తిస్తోంది. రోజుకొక చోట కనిపిస్తూ.. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తోంది. శివుని సర్కిల్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఓ ఆవుపై అటాక్ చేసింది. ఆవుపై దాడి చేస్తూ ట్రాప్ కెమెరాకు చిక్కింది పెద్ద పులి. మహారాష్ట్ర లోని శివుని సర్కిల్‌కు 3 కిలోమటర్ల దూరంలోని తలారి గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు అవులను.. పశువుల కాపరి అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఓ ఆవు కనిపించకుండా పోయింది. దాంతో రైతు, పశువుల కాపరి ఇద్దరూ ఆవును వెతుకుతూ అటవీ ప్రాంతానికి వెళ్లారు. కొంత దూరం వెళ్లగా.. ఆవు మృతదేహం కనిపించింది. ఆ పక్కనే పెద్దపులి పాద ముద్రలు కనిపించాయి.
పులి భయంతో వెనుదిరిగిన వారిద్దరూ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. పాద ముద్రలను గుర్తించి దానిని పెద్దపులిగా నిర్ధారించారు. అలాగు, అటవిలో అమర్చిన ట్రాప్ కెమెరాకు ఆవుపై పులి దాడి చేసిన దృశ్యాలు చిక్కాయి. ఆ దృశ్యాలను చూసిన ఫారెస్ట్ సిబ్బంది సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలానికి, మహారాష్ట్ర సరిహద్దు కలిగి ఉండటంతో అటుగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. కాగా, పెద్ద పులి సంచారం గురించి తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏ క్షణం ఎటువైపు నుంచి పులి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..