Whatsapp: మీ వాట్సాప్ నెంబర్‌కి ఈ మెస్సేజ్‌ వచ్చిందా.. అయితే ఇలా చేయండి..!

|

Jan 31, 2022 | 9:10 AM

Whatsapp: రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ.. అభివృద్ధికి ఎంత ఉపకరిస్తుందో.. జనాలను మోసం చేయడానికి కూడా..

Whatsapp: మీ వాట్సాప్ నెంబర్‌కి ఈ మెస్సేజ్‌ వచ్చిందా.. అయితే ఇలా చేయండి..!
Follow us on

Whatsapp: రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ.. అభివృద్ధికి ఎంత ఉపకరిస్తుందో.. జనాలను మోసం చేయడానికి కూడా అంతే స్థాయిలో ఉపయోగపడుతుంది. టెక్నాలజీలోని కిటుకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు.

ముఖ్యంగా సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువ అవుతున్న ప్రస్తుత కాలంలో.. వాటిని బేస్ చేసుకుని మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అమాయులను టార్గెట్‌గా చేసుకుని నిమిషాల్లో పని ముగిస్తున్నారు. మాయ మాటలతో బురిడి కొట్టించి.. అందినకాడికి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు.. వాట్సాప్ ను అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా వాట్సాప్ వినియోగదారులకు ఓ సందేశం పంపుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి వాట్సాప్‌లో ఓ మెస్సేజ్ చక్కర్లు కొడుతుంది.

ఆ మెసేజ్‌లో మీరు రూ. 50 లక్షల లాటరీ గెలిచారని పేర్కొన్న దుండగులు.. మీకు డబ్బు కావాలంటే వాట్సాప్‌ కాల్ చేయమని చెప్పి వివరాలను తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత వారి ఖాతాల నుంచి డబ్బులను కాజేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ వ్యవహారంపై ప్రజలను పోలీసులు అలర్ట్ చేశారు. మీకు ఇలాంటి మెస్సేజ్‌లు ఏమైనా వస్తే వాటిని నమ్మవద్దని, వాటిని వెంటనే డిలీట్ లేదా బ్లాక్ చేయాలని సూచించారు.

కేటుగాళ్ల దోపిడీ స్టైల్ ఇదీ..
కేటుగాళ్లు ముందుగా వాట్సాప్‌కు వాయిస్‌ మెసేజ్‌ చేస్తారు. అందులో తమను తాము కేబీసీ కస్టమర్ ఆఫీసర్‌గా చెప్పుకుంటారు. మీ నెంబర్‌కి కేబీసీ నుంచి రూ.25 లక్షల లాటరీ వచ్చిందని నమ్మబలుకుతారు. తమ సంస్థ నిర్వహించిన ఈ పోటీల్లో 5 వేల మంది మొబైల్ నంబర్లలో లాటరీ తీస్తే మీ నెంబర్‌ వచ్చిందని నమ్మేలా కబుర్లు చెబుతారు. ఆ తరువాత గేమ్ స్టార్ట్ చేస్తారు. మీకు లాటరీ డబ్బు కావాలంటే వాట్సాప్‌ కాల్ చేయమని అడుగుతారు. ఆడియో మెసేజ్‌లోని చిత్రంలో మేనేజర్ నంబర్, లాటరీ నంబర్‌లు ఉన్నాయని, మీ మొబైల్ ఫోన్‌లో ఆ నెంబర్ సేవ్ చేసి దాని ద్వారా వాట్సాప్ కాల్ చేయాలని సూచిస్తారు. సాధారణ కాల్ చేస్తే మేనేజర్ ను కాంటాక్ట్ చేయడం కుదరదని నమ్మిస్తారు. వాట్సాప్‌కు కాల్ చేస్తే మేనేజర్ లాటరీకి సంబంధించిన మిగతా సమాచారాన్ని చెబుతాడని నమ్మిస్తారు. అది నమ్మిన జనాలు.. వాట్సాప్ కాల్ చేస్తే.. వారి నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర వ్యక్తిగత వివరాలన్నీ సేకరిస్తారు. తద్వారా వారి అకౌంట్లో నుంచి డబ్బులు కాజేస్తారు.

సైబర్ కేటుగాళ్లు సర్క్యూలేట్ చేస్తున్న ఈ మెసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు.

Also read:

Green Tomato Benefits: ఎర్ర టమోటాలే కాదు.. పచ్చి టమోటాలు ఆరోగ్యానికి మంచివి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం !! ఏం జరిగిందంటే ?? వీడియో

Viral Video: మొసలితోనే పరాచకాలా !! సరదా తీర్చిందిగా !! వీడియో