AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathukamma Song: అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా.. బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటిచెప్పిన ఏఆర్ రెహమాన్..

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో తెరకెక్కిన బతుకమ్మ పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డైరెక్టర్ గౌతమ్ మీనన్‏తో కలిసి

Bathukamma Song: అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా.. బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటిచెప్పిన ఏఆర్ రెహమాన్..
Bathukamma Song
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2021 | 6:44 PM

Share

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో తెరకెక్కిన బతుకమ్మ పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డైరెక్టర్ గౌతమ్ మీనన్‏తో కలిసి విడుదల చేశారు. అల్లిపూల వెన్నెల పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగులో రూపొందించారు. తాజాగా విడుదలైన అల్లిపూల వెన్నెల సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇక మరోసారి.. తన మ్యూజిక్ మాయతో ఏఆర్ రెహామాన్.. గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మాయ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. రకరకాల పువ్వులను పేర్చి… అమ్మవారిగా తలచి పూజిస్తూ.. ఆడుతూ పాడుతూ జరుపుకునే ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు. ఇక బతుకమ్మ పండగలో మరింత ప్రత్యేకం బతుకమ్మ పాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను విడుదల చేశారు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా.. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ అందించారు. బతుకమ్మ పాటకు ఆడుపడుచులు సంతోషంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

Bathukamma

Bathukamma

తెలంగాణ ప్రాంతంలో మాత్రమే పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజిస్తుంటారు. గౌరమ్మ, బతుకమ్మ అంటూ అమ్మవార్లను పిలుచుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడకను నిర్వహిస్తారు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభించి.. దాదాపు 9 తొమ్మిది రోజులపాటు.. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేరుస్తూ.. ఒక్కో అమ్మవారిగా పూజిస్తుంటారు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో అమ్మవారిని గౌరమ్మగా పూజిస్తుంటారు. తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. పల్లె నుంచి పట్టణం వరకు తొమ్మిది రోజులపాటు ఘనంగా వేడుకలు జరుగుతుంటాయి.

వీడియో..

Also Read: Aryan Khan Arrest: షారుఖ్ కొడుకు ఆర్యన్‌పై నమోదైన చట్టాలు ఏమిటి… కేసు నిరూపణపైతే శిక్ష ఎన్నేళ్లంటే..

Bigg Boss 5 Telugu: రాజ్యానికి రాజయ్యేది ఎవరు.? ఆసక్తికరంగా బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌.. సిరి, షణ్ముఖ్‌ ఎందుకలా చేశారు.?