IIIT Basara Students Protests: బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. డిమాండ్ల సాధన కోసం మరోసారి పోరుబాట పట్టారు స్టూడెంట్స్. విద్యార్ధుల ఆందోళనతో దిగొచ్చిన అధికారులు, అప్పటికప్పుడు ఆగమేఘాల మీద మెస్ టెండర్లకు కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, ఆ వివరాలను ఆర్జీకేయూటీ సైట్‌లో పెట్టి, వాటిని స్టూడెంట్స్‌కి అందజేశారు. మెస్ టెండర్లకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన తగ్గేదే లేదంటున్నారు విద్యార్ధులు. ఇలాంటి నోటిఫికేషన్స్ గతంలో చాలా ఇచ్చారు, చాలా చూశామ్ అంటూ ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా టెండర్లు రద్దు చేశామని, జులై 24లోగా మెస్ టెండర్లు కంప్లీట్ చేస్తామని చెప్పి, మాట తప్పారంటూ ఫైరవుతున్నారు.
అయితే, ఈసారి కొత్త టెండర్లు ఖరారయ్యే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. దాంతో, బాసర ట్రిపుల్ ఐటీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. మొండి పట్టుదలకు పోవద్దంటూ విద్యార్ధులకు సూచించారు ఉన్నతాధికారులు. మెస్ టెండర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినందున ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, స్టూడెంట్స్ మాత్రం ఈసారి వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. కొత్త మెస్ టెండర్లు ఖరారయ్యాకే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు. ఇవాళ కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ స్పష్టంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..