Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఐటీ ఉద్యోగులకు TSRTC బంపర్ ఆఫర్.. అందుబాటులోకి స్పెషల్ బస్సులు… ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా

మీరు ఐటీ ఉద్యోగులా. సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళ్తున్నారా..? ట్రాఫిక్ సమస్యలతో పాటు ఒళ్లు హూనం అవుతుందా..? అయితే మీకే ఈ గుడ్ న్యూస్.

Hyderabad: ఐటీ ఉద్యోగులకు TSRTC బంపర్ ఆఫర్.. అందుబాటులోకి స్పెషల్ బస్సులు... ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా
TSRTC plans to launch special bus services for Hyderabad techies
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 01, 2022 | 9:53 AM

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్‌ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి ప్రస్తుతం ఆఫీస్‌లకు చేరుకుంటున్నారు. ఈ ప్రత్యేక షటిల్‌ సదుపాయంతో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కాలుష్య బారి నుంచి కూడా కొంతమేరు బయటపడవచ్చు.  షటిల్‌ సర్వీస్‌ కోసం ఆన్‌లైన్‌ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాల మేరకు భవిష్యత్‌లో ఐటీకారిడార్‌లో మరిన్నీ షటీల్‌ సర్వీసులను పెంచబోతుంది.

ఈ షటిల్‌ సర్వీస్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు shorturl.at/avCHI లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ఐటీ ఉద్యోగుల కంపెనీ వివరాలు, లోకేషన్‌, పికప్‌, డ్రాపింగ్‌ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.

బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌

ఐటీ ఉద్యోగులు సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటీల్‌ బస్‌ సర్వీస్‌ ప్రధాన ఉద్దేశం. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది.  ఆ యాప్‌లోనే టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. అంతేకాదు, ఈ సర్వీస్‌లకు ట్రాకింగ్‌ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం బస్‌ ఎక్కడుంది, ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అనే విషయాలను ట్రాకింగ్‌ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. మహిళల భద్రతా నేపథ్యంలో షటిల్‌ బస్‌ల్లో ట్రాకింగ్‌ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఆ యాప్‌లో సర్వీస్‌ నంబర్‌, డ్రైవర్‌, కండక్టర్‌ ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలూ ఉంటాయని వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి