Telangana Elections: తెలంగాణ ఎన్నికలు, నిరుద్యోగులకు పండగే.. విషయం ఏంటంటే..?

ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వీరులను తయారు చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఇప్పటికే అన్ని పార్టీలకు సోషల్ మీడియా పేజీలు ప్రత్యేకంగా ఎన్నికల కోసం పనిచేసేవి ఉన్నాయి. వీటితోపాటు సోషల్ మీడియా వారియర్స్ ను రంగంలోకి దించుతున్నాయి రాజకీయ పార్టీలు. సోషల్ మీడియాలో తమ వీడియోలను వైరల్ చేయటంతో పాటు తమ పోస్ట్‌ల కింద కామెంట్లు, ఎక్కువ రీచింగ్ ఉన్న వీడియోలను షేరింగ్ చేయటంతో...

Telangana Elections: తెలంగాణ ఎన్నికలు, నిరుద్యోగులకు పండగే.. విషయం ఏంటంటే..?
Telangana Elections
Follow us
Vijay Saatha

| Edited By: Narender Vaitla

Updated on: Oct 30, 2023 | 1:44 PM

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఎటు చూసినా పొలిటికల్ లీడర్లే కనిపిస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ తమ జోరు పెంచుకునేందుకు పొలిటికల్ లీడర్లు కొత్త వ్యుహాలను రచిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులపై ప్రతిపక్షాలు విమర్శలు సర్వ సాధారణంగా ఉంటాయి. ఇటీవల కాలంలో నేతలు మాట్లాడిన వీడియోలు, నేతలపై వస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. దీంతో అదే సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.

ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వీరులను తయారు చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఇప్పటికే అన్ని పార్టీలకు సోషల్ మీడియా పేజీలు ప్రత్యేకంగా ఎన్నికల కోసం పనిచేసేవి ఉన్నాయి. వీటితోపాటు సోషల్ మీడియా వారియర్స్ ను రంగంలోకి దించుతున్నాయి రాజకీయ పార్టీలు. సోషల్ మీడియాలో తమ వీడియోలను వైరల్ చేయటంతో పాటు తమ పోస్ట్‌ల కింద కామెంట్లు, ఎక్కువ రీచింగ్ ఉన్న వీడియోలను షేరింగ్ చేయటంతో పాటు తమకు అనుకూలంగా పోస్టులు పెట్టే విధంగా యూత్ ను రిక్రూట్మెంట్ చేసుకుంటూన్నాయి పార్టీలు.

ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోటోస్ పెట్టాయి రాజకీయ పార్టీలు. ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న వారికి.. 30 రోజుల ఉద్యోగం పేరుతో రాజకీయ పార్టీలు రోజుకు 1500 రూపాయలు చొప్పున చెల్లించే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థి పేరుతో ఫ్యాన్ పేజీలు తెరిచి అందులో పోస్టులు పెట్టడంతో పాటు ప్రత్యర్థి ఇచ్చే కౌంటర్ కు రికౌంటర్ పోస్టులు క్రియేట్ చేయడం వీరీ పని.. ఇలా చేసేందుకు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా యూత్ ను ఆకర్షిస్తూ పోస్టులు చేయించుకుంటున్నారు.

వీరు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి వీరి ఖర్చు మొత్తం ఆయా పార్టీలే భరిస్తున్నాయి. వీరికి కావాల్సిన ల్యాప్‌టాప్‌లు సైతం నేతలే అందిస్తున్నారు. అందుకు కావాల్సిన ఇంటర్నెట్‌తో తో పాటు పెట్రోల్ ఖర్చులను సైతం వీరికి చెల్లిస్తున్నారు. ఎలక్షన్ టైంలో నేతల వీడియోలు వైరల్‌గా మారడానికి సోషల్ మీడియానే ప్రధాన అస్త్రం. సోషల్ మీడియా వారియర్ల ద్వారా అనుకూలంగా పోస్టులు పెట్టించుకునే పనిలో పడ్డారు రాజకీయ పార్టీలు.

ఇప్పటికే ఈ తరహాలో పని చేసే వారియర్లు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నారు. అధికార బీఆర్‌ఎస్‌కు వందల సంఖ్యలో సోషల్ మీడియా వారియర్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీల నుంచి వస్తున్న ఆరోపణలకు సోషల్ వారియర్స్ కౌంటర్ చేస్తూ మరికొన్ని పోస్టులు క్రియేట్ చేసి షేర్ చేస్తారు. ఇక కాంగ్రెస్ బీజేపీలకు సైతం ఇలాంటి సోషల్ మీడియా వారియర్స్ వింగ్ ఉంది. ఎప్పటికప్పుడు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటే వారు చేసిన అభివృద్ధిని ఒక మీమ్ రూపంలో క్రియేట్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. అధికార పార్టీలో సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా వింగ్ ఏర్పాటైంది. వీరికి కొన్ని టార్గెట్లు పెడుతూ.. ఎక్కువ పోస్టులు క్రియేట్ చేసేలా సైబర్ వారియర్ కు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..