AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..

మణికొండ పంచవటి కాలనీలో కాల్పుల మోత మోగింది. స్థల వివాదంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ తర్వాత అనుచరులతో కలిసి స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
Gun Firing In Manikonda
Krishna S
|

Updated on: Nov 04, 2025 | 6:36 PM

Share

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పంచవటి కాలనీలో ఉన్న తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్‌ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఖాళీ చేస్తారా..? లేదా అంటూ ప్రభాకర్ తన గన్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల శబ్దం కాలనీవాసులను ఉలిక్కిపడేలా చేసింది.

ఆ తర్వాత ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలం నుంచి బలవంతంగా బయటకు గెంటేసి.. గేటుకు తాళాలు వేశారు. ప్రభాకర్ దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాడరని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ క్రమంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు. తమ భూమిని లాక్కున్న ప్రభాకర్‌తో పాటు అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి