Thummala Nageswara Rao: ఖమ్మంలో టీడీపీ విజయోత్సవ వేడుకలు.. పాల్గొన్న కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి -164 (టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8) స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి..

Thummala Nageswara Rao: ఖమ్మంలో టీడీపీ విజయోత్సవ వేడుకలు.. పాల్గొన్న కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Thummala Nageswara Rao

Updated on: Jun 05, 2024 | 12:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి -164 (టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8) స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి.. ఏపీతో పాటు ఫారిన్, తెలంగాణ రాష్ట్రంలోనూ విజయోత్సవ వేడుకలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభిమానులు కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే.. ఏపీలో చంద్రబాబు గెలవడంపై.. ఖమ్మంలో టీడీపీ, జనసేన పార్టీలు సంబురాలు నిర్వహించాయి.. అయితే.. ఈ వేడుకలకు అనూహ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ఆయా పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా ఆఫీసులోకి వెళ్లిన మంత్రి తుమ్మల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రికి తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు.

వీడియో చూడండి..

అయితే.. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఖమ్మంలో మాత్రం రాజకీయాలు మరోలా ఉంటాయి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో టీడీపీ నేతలు బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతునిచ్చారు. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అంతేకాకుండా గెలిచిన తర్వాత కూడా తెలుగుదేశం నేతలు నిర్వహించిన కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా అలాగే.. ఎన్టీఆర్ జయంతి వర్థంతి వేడుకల్లో సైతం పాల్గొన్నారు.

అయితే.. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీతోనే రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ లో ఆతర్వాత.. కాంగ్రెస్ లో చేరారు.. చంద్రబాబు మంత్రివర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ మంత్రివర్గంలో‌ మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..