Weather Update: వానలు బాబోయ్‌.. వానలు! నేడు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షం..

దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు పలు జిల్లాలకు వర్షసూచన ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

Weather Update: వానలు బాబోయ్‌.. వానలు! నేడు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షం..
AP and Telangana Rain Updates

Updated on: Oct 12, 2025 | 7:42 AM

హైదరాబాద్, అక్టోబర్ 12: దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆదివారం (అక్టోబర్‌ 12) తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రెండు రోజులలో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి తిరోగమనం చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏపీలో నేటి వాతావరణం ఇలా..

దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు పలు జిల్లాలకు వర్షసూచన ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే పలు జిల్లాల్లో ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. ఇక, శనివారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని… కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, దక్షిణ కోస్తాలో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని… కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ప్రకటించింది. ఇందులో భాగంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us