TSPSC: నిరుద్యోగులు అలర్ట్.. ఆ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్
తెలంగాణలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమైన శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్ పీఎస్సీ ఇటీవల అగ్రికల్చర్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమైన శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్ పీఎస్సీ ఇటీవల అగ్రికల్చర్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు ఓ పత్రిక ప్రకటనలో తెలిపింది. నోటిఫికేషన్ నంబర్ 27/2022 ద్వారా వ్యవసాయ, సహకార శాఖలో వ్యవసాయ అధికారి పోస్టుకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 19 వరకు జరుగుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది.
అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 నియామకానికి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 16 వరకు అందుబాటులో ఉన్న టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి తమ జిల్లా ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో వెబ్ ఆప్షన్ డిక్లరేషన్ ఫారం కాపీ తీసుకురావాలని కోరారు. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా 5,51,943 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ఉద్యోగ నొటిఫికేషన్ లు జారీ చేసి ప్రకియను వేగవంతం చేస్తోంది. ఇక అగ్రికల్చర్, ల్యాబ్ టెక్నిషియన్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



