Telangana: తెలంగాణ ఇంఛార్జి డీజీపీగా అంజనీ కుమార్.. పలువురు ఐపీఎస్‌లకు బదిలీలు, అదనపు బాధ్యతలు.. పూర్తి వివరాలివే..

|

Dec 29, 2022 | 4:59 PM

మరో రెండు రోజుల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో.. ఐపీఎస్ బదిలీలను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన అంజనీ కుమార్‌ను ఇంఛార్జ్ డీజీపీగా నియమించింది రాష్ట్రం. ఆయనతో పాటు..

Telangana: తెలంగాణ ఇంఛార్జి డీజీపీగా అంజనీ కుమార్.. పలువురు ఐపీఎస్‌లకు బదిలీలు, అదనపు బాధ్యతలు.. పూర్తి వివరాలివే..
Ips Transfers In Telangana
Follow us on

ఈనెల 31తో తెలంగాణ డీజీపీ మహేందర్‎రెడ్డి పదవీకాలం పూర్తికానుండడంతో ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్‌కు ఆ బాధ్యతలను అప్పగించాలిని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను కూడా జారీ చేసింది రాష్ట్రం. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు కూడా ఆదనపు బాధ్యతలను అప్పగించడం, బదిలీలు చేయడానికి కూడా పూననుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సీఐడీ  అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు బాధ్యతలను అప్పగంచిన ప్రభుత్వం.. రాచకొండ సీపీగా డీఎప్ చౌహాన్‌ను నియమించింది.

అయితే రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన నాటి నుంచి మహేష్ భగవత్ దాని సీపీగా కొనసాగుతున్నారు. ఇప్పటి నుంచి ఆయన బాధ్యతలను డీఎస్ చౌహాన్ నిర్వహించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మహేష్ భగవత్‌ను  బదిలీ చేయాలని ఈసీకి  బీజేపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అదే క్రమంలో  ఏసీబీ డీజీపీగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తకు అదనపు బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వలు జారీ చేసింది. ఇక రాష్ట్ర శాంతిభద్రతల  డీజీగా  సంజయ్ కుమార్ జైన్‌ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీగా జితేందర్‌ను నియమిస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..