Telangana, Andhra Pradesh News Live Updates: దేవుడు పిల్లుస్తున్నాడనీ.. చెరువులో దూకిన బ్యాంక్ ఉద్యోగి! ఆ తర్వాత ఏం జరిగిందంటే
Telangana, Andhra Pradesh News Live Updates: హైదరాబాద్ లో నిన్న సాయంత్రం మళ్ళీ భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.

హైదరాబాద్ లో నిన్న సాయంత్రం మళ్ళీ భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక పక్క ఎండగా ఉన్నప్పటికీ వర్షం కురుస్తూ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ వర్షం క్రమంగా సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీలో కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ట్రంప్ మరో బాంబు:
ఇక అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ట్రంప్ నిర్ణయంతో భారీ భారం పడనుంది. ముఖ్యంగా దీని ప్రభావం టెక్ కంపెనీలకు ఉండనుంది. H1B వీసా ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు. ఔను.. లక్ష డాలర్లు.. మన కరెన్సీలో 88 లక్షలు కడితేనే H1B ఇస్తారట..! అలాగే.. H1Bపై వచ్చేవారికి ఏటా కనీసం లక్ష డాలర్ల జీతం ఉండాలనే నిబంధన పెట్టారు. టెక్ కంపెనీలకు ఇది పిడుగు లాంటి వార్తే..ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన ఇండియన్స్‌కి అమెరికా డోర్స్ క్లోజ్ చేసేసే ప్రయత్నం చేశారు ట్రంప్.. ఓ పక్క ట్రేడ్ డీల్ రచ్చ కొనసాగుతుండగానే H1Bపై నిర్ణయం తీసుకోవడం పెను సంచలనంగా మారింది.
LIVE NEWS & UPDATES
-
పండగ జోష్.. భారీ వర్షం లెక్కచేయకుండా సొంతూళ్లకు పరుగులు!
విజయవాడ హైదరాబాద్ హైవే పై వాహనాల రద్దీ. దసరా సెలవులు ప్రారంభం కావడంతో పల్లె బాట పట్టిన పట్నం వాసులు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాలు క్యూ కట్టాయి. నేషనల్ హైవే 65 పై వాహనాలను పరుగులు పెట్టిస్తున్న వాహనదారులు. సొంత ఊర్లలో దసరా పండగ జరుపుకునేందుకు పిల్ల, పాపలతో వాహనాలలో పల్లెలకు బయలుదేరారు పట్నం వాసులు. జగ్గయ్యపేట ప్రాంతంలో ఈదురు గాలుల తో కూడిన భారీ వర్షం. కొందరు వర్షం దాటికి హైవే హోటళ్ల వద్ద అపుకుంటున్న వాహనదారులు. మరికొందరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు.
-
చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో ట్విస్ట్..!
చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో పురోగతి. చనిపోయిన మహిళ బెంగాల్ కు చెందిన ప్రమీలగా గుర్తింపు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న ప్రమీల. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్న ప్రమీల. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం. కొండాపూర్ ప్రాంతంలో యువకుడితో కలిసి ఉంటున్న ప్రమీల. ప్రమీలను చంపి మూటలో వేసుకొని చర్లపల్లి స్టేషన్కు వచ్చిన యువకుడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొని వచ్చినా యువకుడు. మృతదేహాన్ని చల్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లిన యువకుడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్లిన యువకుడు. అస్సాం కు వెళ్లే ట్రైన్ ఎక్కి పరారైన యువకుడు. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యం.
-
-
మోదీ బాల్య జీవితంపై సినిమా.. పీవీఆర్ థియేటర్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వీక్షణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్య జీవిత ఘట్టాల ఆధారంగా రూపొందించిన ‘చలో జీతే హై’ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్ లోని పీవీఆర్ థియేటర్లో.. బీజేపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి వీక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
-
భారీగా గంజాయి, డ్రగ్స్‌ను కాల్చి బూడిద చేసిన సంగారెడ్డి పోలీసులు
సంగారెడ్డి జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత 583 కిలోల ఎండు గంజాయి, కేజీ 766 గ్రాముల కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల యం.డి.యం.ఎ ను కోర్టు అనుమతితో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు.
యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం సంగారెడ్డి జిల్లాలో నమోదైన 20 కేసులలో సీజ్ చేయబడిన గంజాయిని, ఆల్ప్రా జోలం, ఎండీఎంను పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని మెడికేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. కొందరు అక్రమార్జనలో భాగంగా అక్రమ ఆల్ప్రాజోలం తయారీ, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి లాగుతున్నారని అన్నారు. జిల్లాలో అసాంఘీక, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలను అరికట్టడానికి జిల్లాలో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేపడుతుందన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా, సరఫరా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమంలో ఎస్పీ వెంట సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్యగౌడ్, పటాన్ చెరు డిఎస్పీ ప్రభాకర్, వర్టికల్ డిఎస్పీ సురేందర్ రెడ్డి, మెడికేర్ ఎన్విరాన్‌మెంటల్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, డీసిఆర్బీ ఇన్‌స్పెక్టర్ బి.రమేష్, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, పటాన్ చెరు ఇన్‌స్పెక్టర్ వినాయక్ రెడ్డి, భానూర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంబంధిత ఎస్.హెచ్.ఓ. లు ఉన్నారు.
-
రౌడీషీటర్‌పై హైదరాబాద్ సీపీ నగర బహిష్కరణ
మహమ్మద్ అసద్ అనే రౌడీషీటర్‌ను నగర బహిష్కరణ చేసిన హైదరాబాద్ సీపీ. అసద్ పై 11 క్రిమినల్ కేసులు. కాలపత్తర్ లిమిట్స్ లో రౌడీ షీటర్ గా అసద్.
-
-
స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష
బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలపై బిసి రిజర్వేషన్ బిల్స్ పెండింగ్ పై సమావేశం. హైకోర్టులో, సుప్రీంకోర్టులో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష. పాల్గొననున్న మంత్రులు, అధికారులు, న్యాయనిపుణులు. ఈనెలాకరుతో స్థానిక ఎన్నికల నిర్వాహణపై ముగియనున్న హైకోర్టు గడువు. మేడారం పైలట్ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ ఆమోదంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
-
నిన్న రాత్రి వర్షానికి జిల్లా పరిషత్ ప్రాంగణంలో కూలిన భారీ వృక్షం
గుంటూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలో కూలిన భారీ వృక్షం. నిన్న రాత్రి వర్షానికి నేలకొరిగిన చెట్టు. దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, విద్యుత్ పోల్స్. కార్యాలయంలో రాకపోకలకు అంతరాయం.
-
ఎదురుగాలులతో భారీ వర్షం
ఉమ్మడి పశ్చిమగోదావారి జిల్లా వ్యాప్తంగా భారీవర్షం కురుస్తుంది. ఎదురుగాలులతో వర్షపడటంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.
-
కుటుంబ కలహాలు.. భార్యను కత్తితో పొడిచిన భర్త!
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని యల్లమ్మ వీధిలో భార్య బాలమణిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన భర్త నారాయణస్వామి. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలమణిని వెనుకవైపు నుంచి కత్తితో 3 చోట్ల పొడిచిన భర్త నారాయణస్వామి. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన కదిరి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించిన తనయుడు భార్గవ్. కుటుంబ కలహాలతోనే గొడవ జరిగినట్లు తెలిపిన భార్య బాలామణి.
-
సెప్టెంబర్ 22 నుంచి బాసర దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..
నిర్మల్ జిల్లా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన బాసర దేవస్థానం. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపిన ఆలయ ఈవో అంజనా దేవి. ఈనెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి చెంత నూతనంగా నవర్నవ అర్చక, శ్రీ చక్ర పూజ నిర్వహిస్తామని తెలిపిన ఆలయ అర్చకులు. అన్ని శాఖల సమన్వయంతో బందోబస్తుని నిర్వహిస్తామని తెలిపిన ఆలయ అధికారులు. మూల నక్షత్రం రోజు సుమారు లక్ష వరకు భక్తులు వస్తారని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని తెలిపిన ఈవో. 29వ తారీకు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి అవతారం కావడంతో క్యూ లైన్ లలో పాలు, పండ్లు చిన్నపిల్లలకు, భక్తులకు అందిస్తామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపిన ఈవో అంజనాదేవి. నూతనంగా మూడు వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మండపాలు, 150 రూపాయల మండపాలను భక్తులను దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఏర్పాటు చేశామని ఈవో అంజనా దేవి తెలిపారు.
-
దేవుడు పిల్లుస్తున్నాడనీ.. చెరువులో దూకిన బ్యాంక్ ఉద్యోగి! ఆ తర్వాత జరిగిందిదే
పది రోజులుగా ఏదో అదృశ్య శక్తి రమ్మని పిలుస్తుందంటూ బర్ల సురేందర్ (36) అనే వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా రాంనగర్‌కు చెందిన హైదరాబాద్ రామంతపుర్‌లోని డీ మార్ట్ వెనకాల కాపురం ఉంటున్న సరేందర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న సురేందర్ శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి బయల్దేరి క్యాబ్ బుక్ చేసుకుని బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువు నుంచి నిత్యం తనను ఎవరో పిలుస్తున్నారని, అందుకే చనిపోతున్నట్లు మెసేజ్, వాయిస్ రికార్డులు పంపి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
-
నిన్న ఆరోపణలు.. నేడు వరుస ప్రశంసలు.. డిప్యూటీ సీఎంపై బొండా ఉమ వరస ట్వీట్స్ వైరల్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి బొండా ఉమ వరస ట్వీట్స్ చేశారు. ఇందులో అసెంబ్లీలో నిన్న ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం అంటూ ప్రశంసించారు. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం, మంచి పేరు పెరుగుతోంది అంటూ మరో ట్వీట్. నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరుపై అసెంబ్లీ లో తీవ్ర ఆరోపణలు చేసిన బోండా ఉమా.. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెబుతున్నారన్నారు. బోండా ఉమా ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న పవన్.. పీసీబీ చైర్మన్ తో పాటు అధికారులతో సమీక్షించి బోండా ఉమా బెదిరింపులపై సీఎం కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో బోండా ఉమా తాజా ట్వీట్ లపై ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. https://t.co/LrcB2AFbeO
— Bonda Uma (@IamBondaUma) September 20, 2025
-
నటుడు మోహన్ లాల్‌కు ప్రధాని మోదీ అభినందనలు.. ట్వీట్ వైరల్
మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మోహన్‌లాల్ శ్రేష్ఠత, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక. దశాబ్దాలుగా గొప్ప కృషితో మలయాళ సినిమా, నాటక రంగంలో ప్రముఖుడిగా నిలుస్తున్నారు. కేరళ సంస్కృతి పట్ల మక్కువ కలిగిన ఆయన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆయన సినిమా, నాటక నైపుణ్యం నిజంగా స్ఫూర్తిదాయకం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Shri Mohanlal Ji epitomises excellence and versatility. With a rich body of work spanning decades, he stands as a leading light of Malayalam cinema, theatre and is deeply passionate about the culture of Kerala. He has also delivered remarkable performances in Telugu, Tamil,… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/P0DkKg1FWL
— Narendra Modi (@narendramodi) September 20, 2025
-
ఇప్పటికే పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో మోహన్‌లాల్‌కు సత్కారం.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం
నటుడు మోహన్‌లాల్‌కు ఇప్పటివరకూ మొత్తం 6 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక సినీ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతోనూ సత్కరించింది. ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయన గౌరవాన్ని మరింత పెంచింది.
-
71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌కు సాహెబ్ ఫాల్కే అవార్డు
2023 సంవత్సరానికి గానూ మళయాల సూపర్‌సార్ట్ మోహన్‌లాల్‌కు కేంద్ర సమాచార, ప్రసారశాఖ శనివారం (సెప్టెంబర్ 20) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. సినీ రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించి, మలయాళ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు ఈ అవార్డు వరించింది. సెప్టెంబరు 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.
-
సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే 2025 అవార్డు
మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కేంద్రం దాదాసాహెబ్ అవార్డు 2025తో సత్కరించనుంది. సెప్టెంబర్ 23న ఈ అవార్డును ప్రదానం చేయనుంది. సినీ రంగానికి ఆయన చేసి సేవలకుగానూ కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది.
On the recommendation of the Dadasaheb Phalke Award Selection Committee, the Government of India is pleased to announce that Shri. Mohanlal will be conferred the prestigious Dadasaheb Phalke Award 2023.
Mohanlal’s remarkable cinematic journey inspires generations! 🌟
The… pic.twitter.com/n1L9t5WQuP
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 20, 2025
-
ఎద్దుల బండిని ఢీ కొట్టిన బైక్.. తండ్రి, కుమార్తే మృతి
బాపట్ల జిల్లా రేపల్లెలో ఎద్దుల బండిని ఢీ కొట్టిన బైక్. ఇద్దరూ మృతి, మరొక ఇద్దరికి తీవ్ర గాయాలు. తండ్రి, కుమార్తే మృతి. తల్లి, మరొక కుమార్తెకు గాయాలు. భట్టిప్రోలు వద్ద 216ఏ జాతీయ రహదారి పై ఘటన. కుటుంబంతో బైక్‌పై వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
-
ఏపీలో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ
ఏపీలో 9 మంది ఐఏఎస్‌లు బదిలీకానున్నారు. ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ, ఆర్ & బీ డైరెక్టర్‌గా ప్రశాంతి, ఎక్సైజ్ డైరెక్టర్‌గా శ్రీధర్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీగా అంబేద్కర్, కృష్ణా జిల్లా జేసీగా నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం, నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్.. కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
-
పండక్కి హైదరాబాదు నుంచి విజయవాడకు భారీగా క్యూ కట్టిన జనాలు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ వాహన రద్దీ.. హైదరాబాదు నుంచి విజయవాడకు భారీగా క్యూ కట్టిన వాహనదారులు. రేపటి నుంచి దసరా పండుగ సెలవులు రావడంతో పట్నం నుంచి పల్లెలకు పయనమైన వాహనదారులు. ఎన్‌హెచ్ 65పై సందడి చేస్తున్న వాహనాలు.
-
ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆట పాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.
-
సెప్టెంబర్ 22 నుంచి మెడిసిన్స్‌పై భారీగా తగ్గనున్న GST
సెప్టెంబర్ 22 నుంచి మెడిసిన్స్‌పై జీఎస్టీ భారీగా తగ్గనుంది. 12 శాతం ఉన్న జీఎస్టీ 05 శాతం, 18 శాతం ఉన్న జీఎస్టీ కొన్ని మందులపై 12 శాతం, కొన్ని మందులపై 05 శాతం, 05 శాతం ఉన్న మందులపై జీరో జీఎస్టీ అమలుకానుంది. జీఎస్టీ తగ్గక ముందు రేట్ల వివరాలు, తగ్గిన తర్వాత రేట్ల వివరాల డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. మెడికల్ షాప్‌లలో డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
-
బీజేపీ, బీఆర్‌ఎస్ బంధం బలపడుతుంది.. మాజీ ఎంపీ మధు యాష్కీ
బీజేపీ, బీఆర్‌ఎస్ బంధం బలపడుతుందని మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. అందుకే కాళేశ్వరం మీద సీబీఐ ముందుకి అడుగులు వేయడం లేదు. ఎన్నికలప్పుడు కాళేశ్వరం ఏటీఎం లాగ అయ్యిందని మాట్లాడిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. 9 సంవత్సరాలు తర్వాత కవితకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? సారా కుంభకోణంలో ఉన్న ఆమె నీతులు చెప్పడం, కరెప్షన్ మీద మాట్లాడడం విడ్డూరంగా ఉంది. విమలక్క లాంటి వాళ్ళు పార్టి పెడితే ప్రజలు ఆదరిస్తారు. సారా కుంభకోణంలో ఉన్న ఈమె పార్టీ పెడితే ఎవరు ఆదరిస్తారు. దోచుకున్నది దాచుకోవడానికి జాగృతి ఉపయోగపడింది. చనిపోయిన రైతు కుటుంబాల పేర్ల పైసలు తీసుకున్నారు. ఇన్ని రోజులు హరీష్ రావు, కెటిఆర్ తో మంచిగా ఉండి ఇప్పుడు ఆ ఇద్దరి మీద ఎందుకు మాట్లాడుతుంది. కేసీఆర్ తీస్తున్న చిత్రం లో ఇవన్నీ చిన్న చిన్న బిట్లు.. అధికారం లోకి రావడానికి ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు. అటెన్షన్ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు..పార్టీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. చనిపోయిన రైతు కుటుంబాల పేర్లు చెప్పి వాళ్ళ పైసలు తీసుకుంది. శవాల మీద పేలాలు ఏరుకున్నది ఆమె.
తీన్మార్ మల్లన్న మాటలు అయిన జనాలు నమ్ముతారు కానీ కవిత మాటలు ఎవరు నమ్మరు. మాకు నెక్స్ట్ పోటీ బీజేపీ తో ఉంటుంది. నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రాలేమని అనుకుంటే సీబీఐనీ అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఏమి అవినీతి చేయలేదని చెపుతారు. సీఎం రమేష్ నీ నేను కలవలేదని ఎప్పుడు కేటీఆర్ చెప్పలేదు. చాలా రాష్ట్రాల నుండి రేవంత్ ను ప్రచారంకు రావాలని అంటున్నారు. రేవంత్ రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారు.
-
ఛీఛీ ఇదేం పని పెద్దమనిషి.. మందుకొట్టి స్కూల్‌కి వచ్చిన ఇద్దరు టీచర్లు సస్పెండ్
విజయనగరం మెంటాడ మండలం కుంటినవలస ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు. స్కూల్‌కి మద్యం సేవించి వస్తున్నారన్న ఆరోపణలపై విచారణ. హెడ్మాస్టర్ రామకృష్ణారావుతో పాటు మరో టీచర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.
-
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వాటర్ బాటిల్ ధర
రైల్ నీర్ వాటర్ బాటిల్ ధర సెప్టెంబర్ 22 నుంచి తగ్గనుంది.. పూర్తి వివరాలు
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరింత చౌకగా మంచి నీళ్ల బాటిల్!
-
ఇక పని గంటలు 13.. రాత్రి షిఫ్టుల్లోనూ మహిళలు..
పని గంటల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 8 గంటల పని విధానాన్ని 13 గంటలకు పెంచారు. దీనితోపాటు రాత్రి షిఫ్టుల్లో మహిళలు కూడా పని చేసేలా చట్టంలో సవరణలు చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు ఫ్యాక్టరీల చట్టం 1948ను రాష్ట్రానికి వర్తించేలా సవరణలు చేసే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. చట్టంలోని 54వ సెక్షన్‌లో కార్మికులు 10 గంటలకు మించి పనిచేయరాదని పేర్కొంటునే ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ అనుమతితో 13 గంటల వరకూ పనిచేయించుకునేందుకు అనుమతించారు. ఇలా ఒక వారంలో మొత్తం 60 గంటలకు మించి పనిచేయించరాదని పేర్కొంది.
-
ట్రంప్ సంచలన ప్రకటన.. కేవలం 2 గంటల్లోనే అమెరికా వెళ్లే విమానాల్లో ధరలకు రెక్కలు
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దీంతో తక్షణమే అమెరికా తిరిగిరావాలని తమ ఉద్యోగులకు టెక్ కంపెనీలు కబురు పంఆయి. దీంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి హడావుడిగా బయల్దేరుతున్న టెకీలకు ఎయిర్‌పోర్టులో మరో షాకింగ్ న్యూస్ అందింది. అదేంటంటే.. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అమెరికా వెళ్లే విమానాల్లో టికెట్ ధరలు రెట్టింపయ్యాయి. అదీ రెండు గంటల్లో టికెట్ ధరలు భారీగా పెరిగాయి.
-
విద్యార్థులే కూలీలు.. ప్రమాదకరంగా బెంచీల తరలింపు
విద్యార్థులకు పాఠశాలలో మౌలిక వసతులు కల్పన కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చేసి చూపించడం లేదు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పట్టణంలోని పురానిపేట ప్రభుత్వ పాఠశాలలో అవసరమున్న మేరకు బెంచీలు లేకపోవడంతో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరండ్ల పాఠశాలలో ఉన్న బెంచీలను విద్యార్థుల చేత ట్రాక్టర్ లో ఎక్కించి జగిత్యాల కు తరలించారు. ట్రాక్టర్లో లోడ్ చేసిన బెంచీలను పట్టుకొని ప్రమాదకరమైన రీతిలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి బెంచీలను తరలించిన తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పురాని పేట స్కూల్ హెడ్మాస్టర్ ను వివరణ కోరగా.. స్కూల్లో విద్యార్థులకు బెంచీలు సరిపోకపోవడంతోనే వారి సౌకర్యార్థమే తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే తమకు ఎలాంటి నిధులు లేకపోవడంతోనే పిల్లలతో బెంచీలు తరలించినట్లుగా చెప్పుకొచ్చారు.
-
నంద్యాల CSI చర్చి స్మశాన వాటిక వద్ద ఉద్రిక్తత
నంద్యాల నందికొట్కూరు సియస్ఐ చర్చి స్మశాన వాటిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్న పోలీసులు. సిఎస్ఐ స్మశాన వాటిక వద్దకు ఎవరిని అనుమతి ఇవ్వని పోలీసులు. గత 40 సంవత్సరాలుగా స్మశాన వాటిక స్థలంగా ఉందంటున్న సిఎస్ఐ చర్చి సభ్యులు. రాజకీయ నాయకులు అండదండలతో కొందరు స్మశాన వాటిక కబ్జాకు తెరలేపినట్లు ఆరోపిస్తున్న సిఎస్ఐ సంఘ సభ్యులు.
-
గోల్కొండ హనీ ట్రాప్ కేసులో మరో కీలక పరిణామం
గోల్కొండ హనీ ట్రాప్ కేసులో నేడు చంచల్గూడా జైలు నుంచి ఐదుగురి నిందితులను కస్టడీకి తీసుకోనున్న గోల్కొండ పోలీసులు. నిందితులను రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు. ప్రస్తుతం చంచల్గూడా జైలులో ఉన్న ఐదుగురు నిందితులు. అమర్, మౌలాలి, రాజేష్ మంజుల, రజిని ఐదుగురిని కస్టడీకి తీసుకోనున్న గోల్కొండ పోలీసులు. ఈ నెల 13న గోల్కొండ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు.
-
హైదరాబాద్‌లో 4వ రోజు క్యాప్స్ గోల్డ్ సోదాలు
హైదరాబాద్‌లో క్యాప్స్ గోల్డ్‌లో నాలుగో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు. అల్వాల్ లోనే బంధువుల ఇంట్లో 50 లక్షల నగదు తో పాటు, బంగారు బిస్కెట్ల స్వాధీనం. ప్రతి సంవత్సరం వేలకోట్ల బిజినెస్ చేస్తున్న క్యాప్స్ గోల్డ్. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ప్రతి సంవత్సరం వందల కేజీల బంగారం కొనుగోలు. కొనుగోలు చేసిన బంగారాన్ని నగరంలోని పెద్ద పెద్ద బంగారం షాపులకు విక్రయిస్తున్న క్యాప్స్ గోల్డ్. ప్రతి సంవత్సరం 8 వేల కోట్ల నుండి 11 కోట్ల బిజినెస్ చేస్తున్న క్యాప్సిగోల్డ్. 2020లో 3,218.06 కోట్ల వ్యాపారం, 2021లో 8,718 కోట్లు 2022 లో 10,424 కోట్లు, 2023లో 6,959 కోట్లు, 2024 8,385 కోట్ల వ్యాపారం జరిగింది. క్యాప్స్ గోల్డ్ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించిన ఐటీ.
-
రంగారెడ్డి-హైదారాబాద్ టీమ్‌లు భారీగా మద్యం పట్టివేత
హైదారాబాద్ ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్‌లు, DTF ఎక్సైజ్ పోలీసులు కలిసి శనివారం నాన్ డ్యూటి పెయిడ్ (ఎన్‌డీపీఎల్) 585 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 21.80 లక్షలుగా ఉంటుందని అంచనా.
-
బస్సును వెనుక నుంచి ఢీ కొట్టిన 2 వాహనాలు.. ఆ తర్వాత
కుత్బుల్లాపూర్‌లో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ పిఎస్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్లో రెండు ప్రవేట్ వాహనాలు వెనుక నుండి ముందు ఉన్న బస్సు ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు కి స్వల్ప గాయాలవగా ఆసుపత్రికి తరలించారు.
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల గంజాయి సీజ్
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఇది అభ్యమైంది. పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు.
-
న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్
ఆన్ లైన్‌లో న్యూడ్ వీడియోలతో పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన భార్య భర్త మల్లేష్, మేరీ.. మల్లేష్ ప్రియురాలు మల్లిక అక్రమంగా డబ్బులు సంపాదించాలని కుట్ర పన్ని ట్విట్టర్‌లో సంయుక్త రెడ్డి అని ఓ ఐడీ ఓపెన్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేశారని కర్నూలు సీఐ నాగరాజరావు తెలిపారు.
-
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో మైలురాయి
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో మైలురాయి. ముంబై-థానే మార్గంలో ఐదు కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ టన్నెల్‌ను పరిశీలించారు.
-
Kavitha: తొక్కుకుంటూ వెళ్తేనే స్పేస్ లభిస్తుంది.. కవిత వ్యాఖ్యలు
రాజకీయాలు, ప్రజా జీవితంలో ఎవరూ స్పేస్ ఇవ్వరని కవిత అన్నారు. చిట్ చాట్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కుకుంటూ వెళ్తేనే స్పేస్ లభిస్తుందని అన్నారు. ఎన్టీఆర్, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి.. ఇరిగేషన్ సహా చాలా శాఖల ఫైల్స్ నేరుగా కేసీఆర్‌కు వెళ్లాయి.. కిందిస్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండా నేరుగా నాటి సీఎం కేసీఆర్ దగ్గరకు దస్త్రాలు వెళ్లాయి. ఫైల్స్ సంగతి చూసుకోమని 2016లోనే కేటీఆర్‌కు చెప్పా. కాళేశ్వరం విషయంలో తప్పితే హరీష్‌పై నాకు వేరే కోపం లేదని అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. చాలా అంశాల్లో తనకేం సంబంధం లేదని, అంతా కేసీఆర్ నిర్ణయమేని హరీష్ చెప్పినట్లు నివేదికలో ఉందని అన్ననారు.
-
H1B వీసాల విషయంలో ట్రంప్ నిర్ణయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
ఇతర దేశాలపై ఆధారపడటమే మాకు శత్రువుతో సమానమని, ఇతరులపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు అని ప్రధాని మోదీ అన్నారు. మనమంతా కలిసి ఈ శత్రువును జయించాల్సిన అవసరం ఉందన్నారు. నేను ఈ మాటలు ఎప్పట్నుంచో చెబుతున్నాను.. విదేశాలపై ఎంతగా ఆధారపడితే మనం దేశం అంతలా విఫలమవుతుందని అన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను ఆత్మనిర్భర్ దేశంగా మార్చాల్సిందేనని అన్నారు. ఇతరులతో కలినినడుస్తాం, కానీ, ఆత్మాభిమానంతో బతుకుతాం అని అన్నారు. H1B వీసాలపై ట్రంప్ నిర్ణయం వేళ మోదీ కీలక ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాలను వదిలి స్వదేశ అభివృద్ధికి పాటుపడాలని, విదేశీ మోజులో స్వదేశాన్ని మరువొద్దు అని మోదీ అన్నారు.
-
కాంగ్రెస్‌లో చేరికపై కవిత కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్‌చాట్‌లో భాగంగా కాంగ్రెస్‌లో చేరికపై రియాక్షన్ ఇచ్చారు. కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు కవిత. కాంగ్రెస్ పెద్దలెవరూ నన్ను సంప్రదించలేదని, మళ్లీ అధికారంలోకి వచ్చేఅర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాకపోతే మంచిది.. వస్తే మా కర్మ అంటూ వ్యాఖ్యానించారు.
-
CM Revanth Reddy: చిట్ చాట్‌లో కవితపై రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
చిట్‌చాట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత అంశం కేసీఆర్ కుటుంబ వ్యవహారమని అన్నారు. కవితపై KCR, KTR, హరీష్, సంతోష్ దాడి చేస్తున్నారని, కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్.
-
ఆల్మట్టి డ్యాం ఎత్తు విషయంలో కవిత కీలక కామెంట్స్
అల్మట్టి డ్యాం ఎత్తు విషయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టిఎత్తు పెండడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ఆల్మట్టి ఎత్తుపెంచితే తెలంగాణలోని కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకునే పరిస్థితి వస్తోందని, భారీగా వరద వస్తే తప్ప ఇప్పటికే నారాయణపూర్‌కి నీరురాని పరిస్థితి ఉందన్నారు. ఐదు జిల్లాల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే సీఎం ఎందుకు స్పందంచడం లేదన్నారు. కర్నాటక నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లిందని, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందంటూ కవిత ప్రశ్నించారు.
-
Trump: ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీల అలర్ట్
హెచ్-1బీ వీసాల అప్లికేషన్ ఫీజును ట్రంప్ కోటి రూపాయలకు పెంచారు. ఈ క్రమంలో టెక్ కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు డెడ్‌లైన్ ముగిసేలోపు అమెరికాకు తిరిగిరావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం.
జుకర్‌బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం రెండు వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికీ వెళ్లొద్దని సూచించింది. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు 24 గంటల్లోపు తిరిగి యూఎస్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
-
సోలార్ ప్రాజెక్టుకు మోదీ ప్రారంభోత్సవం
ఛరా పోర్టులో HPLNG రీగ్యాసిఫికేషన్ టెర్మినల్, గుజరాత్ IOCL రిఫైనరీ, ఆక్సో ఆల్కహాల్ ప్రాజెక్ట్, 600 మెగావాట్ల గ్రీన్ షూ ఇనిషియేటివ్, PM-కుసుమ్ 475 మెగావాట్ల సోలార్ ఫీడర్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే.. ధోర్డో గ్రామం మొత్తం పూర్తిగా సోలార్ పవర్ చేయడంతో.. ఈ ప్రాజెక్ట్‌ను కూడా మోదీ ప్రారంభిస్తారు.
-
PM Modi: గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. భావనగర్‌లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో దారిపొడవునా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో రూ.34వేల 200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు మోదీ. అనంతరం ధోలేరాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ఉంటుంది.
-
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సమయం పట్టే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరగవని తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల విషయంలో.. సుప్రీం తీర్పు వరకు వేచి చూస్తామన్నారు సీఎం రేవంత్. ఈ నెల 30లోపు స్థానిక ఎన్నికలు జరపాలన్నహైకోర్టు ఆదేశాలపై తెలంగాణ సర్కార్ సుప్రీంను ఆశ్రయించనుంది. స్థానిక ఎన్నికలకు గడువు కావాలని ప్రభుత్వం కోరనుంది.
-
జమ్మూ కాశ్మీర్‌లో సోదాలు
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత కేసుకు సంబంధించి శ్రీనగర్‌తో సహా అనేక ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ విభాగం ఈ దాడులను నిర్వహిస్తోంది. దర్యాప్తులో భాగంగా కౌంటర్-ఇంటెలిజెన్స్ కాశ్మీర్ (CIK) లోయ అంతటా ఎనిమిది ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.
శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుప్వారా, హంద్వారా, పుల్వామా, షోపియన్ జిల్లాల్లో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ 3/2023కి సంబంధించి సమర్థ కోర్టు నుండి వారెంట్ జారీ అయిన తర్వాత ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
-
అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ వివాదం
అసెంబ్లీ సమావేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరు, చైర్మన్ కృష్ణయ్యపై ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బోండా ఉమా వ్యాఖ్యలు వ్యక్తిగత ఉద్దేశాలతో, బెదిరింపు ధోరణిలో ఉన్నాయని.. వీటిపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీనిపై ఒక నోట్ రిలీజ్ చేశారు. నిన్న అసెంబ్లీలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై పీసీబీ ఛైర్మన్, సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కార్యాలయం అధికారికంగా నోట్ విడుదల చేసింది. బోండా ఉమా వ్యక్తిగత ఉద్దేశాలు, బెదిరింపు ధోరణిపై కరెక్ట్ కాదని నిన్న అసెంబ్లీలోనే చెప్పారు పవన్. గతంలో ఎవరితోనే కలిసి ఉన్నారని, ఇప్పుడు కక్ష సాధింపు ధోరణి ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు.
-
సెప్టెంబర్ 21 నుంచి దసరా సెలవులు
తెలంగాణలో దసరా సెలవులు వచ్చేశాయి. ఈ నెల 21 అంటే రేపటి నుంచి విద్యార్థులకు దసరా సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవులు వచ్చే నెల 3వ తేదీ వరకు ఉంటాయి. 4న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి.
-
కేరళను వణికిస్తున్న అమీబా
అదో సూక్ష్మజీవి. కంటికి కనిపించదు. చెవికి వినిపించదు. అసలు దాని ఉనికే మనిషికి తెలియదు. కానీ మనకు తెలియకుండానే మన శరీరంలోకి దూరి, మన మెదడులోకి ప్రవేశించి..కొంచెం కొంచెంగా మన బ్రెయిన్‌ను తినేస్తుంది. కొన్నిరోజుల్లోనే మనల్ని చంపేస్తుంది. అంతటి డేంజర్ క్రిమి..ఇప్పుడు మన దేశాన్ని భయపెడుతోంది. అదే అమీబా. ఇప్పుడది కేరళను వణికిస్తోంది.
-
MRP ధరల లేబుళ్లపై ఉపశమనం
వినియోగ వస్తువులపై వర్తించే GST రేట్లను సవరించడం ద్వారా ప్రభుత్వం కంపెనీలకు గణనీయమైన ఉపశమనం కలిగించింది. సెప్టెంబర్ 22, 2025 కి ముందు తయారు చేసిన ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై సవరించిన ధర (MRP) స్టిక్కర్‌ను కంపెనీలు ఇకపై ప్రదర్శించాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది, కంపెనీలు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాలని సూచించింది.
-
ఇంటెలిజెన్స్ సోదాలు
కశ్మీర్‌లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సోదాలు నిర్వహిస్తున్నారు. 7 జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. అయితే ఉగ్రవాద లింకులపై సెర్చింగ్ జరుగుతుంది.
-
ఉత్తమ్ కుమార్ సమీక్ష
ఇవాళ సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు హాజరు కానున్నారు. తమ్మిడిహట్టిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రపోజల్స్ రెడీ చేయదని చెప్పారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తుందంటూ ఇప్పటికే ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
టెక్నాలజీ రంగంపై తీవ్ర ప్రభావం
ట్రంప్ నిర్ణయంతో అమెరికా H-1B వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ, టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు అటార్నీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ అన్నారు. హెచ్1బీ వీసా కలిగిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ఇక ట్రంప్ భారతీయ ఇంజినీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశముంది.
-
ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు
ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. వెంకటాపురంలో ప్రధాన రహదారికి ఇరువైపులా పోస్టర్లు వెలిశాయి. CPI మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీపేరుతో పోస్టర్లు వెలవడ్డాయి. విప్లవ ప్రతిఘాతుక కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి 27వ తేదీ వరకు జరిగే 21వ ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.
-
పాఠశాల ప్రాంతంలో బాంబు స్క్వార్డ్స్
ఢిల్లీ స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు రావడంతో పాఠశాల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు,అగ్నిమాపక బృందాలు, బాంబు స్క్వార్డ్స్. గత కొన్ని నెలలుగా, ఢిల్లీలోని అనేక పాఠశాలలు, హోటళ్ళు, ఆసుపత్రులు కోర్టులకు వరుస ఫేక్ బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
-
ఢిల్లీ స్కూల్స్‌కు ఆగని బాంబు బెదిరింపులు
ఢిల్లీ స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఎనిమిది నెలల్లో 150 కి పైగా పాఠశాలలు, కళాశాలలకు ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వారక, కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయ సహా ఢిల్లీలోని అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
-
విశాఖ కేంద్రంగా కల్తీ నెయ్యి దందా
విశాఖ కేంద్రంగా కల్తీ నెయ్యి దందా కొనసాగుతోంది. బళ్లారి నుంచి వచ్చి లాడ్జ్‌లో మకాం వేశారు. పామాయిల్, ఫుడ్ కలర్స్, క్రీమ్‌తో లాడ్జిలోనే నెయ్యి తయారీ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పల్లెటూరు ప్రజల్ని టార్గెట్ చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాటరింగ్ వారికి కూడా తక్కువ ధరకు సరఫరా చేస్తూ లీటర్ రూ.350కి అమ్ముతున్నారు ముఠా సభ్యులు. బెంగళూరులో కల్తీ నెయ్యి తయారీ నేర్చుకున్నాం అని చెబుతున్నారు నిందితులు.
-
Caps Gold: క్యాప్స్ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు
Caps Gold: క్యాప్స్ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ బెంగళూరు, ముంబయిలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో 20 వేల కోట్లకు పైగా బిజినెస్ చేసింది క్యాప్స్ గోల్డ్. క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. 50 లక్షలు, బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్ లాకర్లను సైతం పరిశీలించారు ఐటీ అధికారులు. హ్యాకర్ల సాయంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఓపెన్ చేయిస్తున్నారు అధికారులు. ట్యాక్స్ చెల్లింపులపై కంపెనీ డైరెక్టర్ చందా సుధీర్‌ను అడిగి తెలుసుకున్న ఐటీ అధికారులు. నేడు చందా డైరెక్టర్ చందా శ్రీనివాసును మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకోనున్న ఐటీ అధికారులు.
-
కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే..
కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట అని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు హరీష్‌రావు. 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం అమోఘం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
-
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మరోసారి స్పందించిన హరీష్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మరోసారి స్పందించారు బీఆర్ఎస్ నేత హరీష్‌రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డ టు మల్లన్న సాగర్... మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు 84వేల కోట్లు అయితే కేవలం తమ్మిడిహట్టి టూ ఎల్లంపల్లికే 35 వేల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారట అని అధికారపార్టీపై వ్యంగ్యంగా స్పందించారు హరీష్‌రావు.
-
బస్సు బోల్తా
పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నాదెండ్ల మండలం మేరిగపూడి దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30మందికి స్వల్ప గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. రాజస్థాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
-
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈనెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
-
మరో బాంబు పేల్చిన ట్రంప్
ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. H1B వీసా ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు. ఔను.. లక్ష డాలర్లు.. మన కరెన్సీలో 88 లక్షలు కడితేనే H1B ఇస్తారట..! అలాగే.. H1Bపై వచ్చేవారికి ఏటా కనీసం లక్ష డాలర్ల జీతం ఉండాలనే నిబంధన పెట్టారు. టెక్ కంపెనీలకు ఇది పిడుగు లాంటి వార్తే..ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన ఇండియన్స్‌కి అమెరికా డోర్స్ క్లోజ్ చేసేసే ప్రయత్నం చేశారు ట్రంప్.. ఓ పక్క ట్రేడ్ డీల్ రచ్చ కొనసాగుతుండగానే H1Bపై నిర్ణయం తీసుకోవడం పెను సంచలనంగా మారింది.
Published On - Sep 20,2025 6:06 AM
