త్వరలోనే జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం.. అమిత్ షాను ఆహ్వానించిన ఎంపీ ధర్మపురి అర్వింద్..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ నెలాఖరున తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం.. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించనున్నారు.. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు చైర్‌పర్సన్ పల్లె గంగిరెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలిసి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్తెలిపారు. సోమవారం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కార్యాలయ ప్రారంభోత్సవ అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్మాట్లాడుతూ.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కచ్చితైన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ సైతం ఈ విషయంలో తనవంతు పాత్రను పోషిస్తోంది. నిజామాబాద్‌లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Hon’ble Union Home & Cooperation Minister Shri Amit Shah Ji to Inaugurate National Turmeric Board Headquarters in Nizamabad, Telangana
On 9th June 2025, myself and National Turmeric Board Chairperson Shri Palle Ganga Reddy met Hon’ble Union Home & Cooperation Minister Shri… pic.twitter.com/uKTjCwYYeD
— Arvind Dharmapuri (@Arvindharmapuri) June 9, 2025
దేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ, ప్రపంచ మార్కెట్ ప్రాప్యత, కొత్త శకానికి ప్రతీకగా ఈ లోగో ఉండనుందని ఎంపీ అర్వింద్ తెలిపారు. ఈ బోర్డు ప్రధానంగా పసుపు సాగుదారులకు ఒక మలుపుగా నిలువనుందని అర్వింద్ తెలిపారు. అలాగే సహకార సంఘాల స్ఫూర్తిని, రెతుల నేతృత్వంలోని అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..