Telangana Elections: బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం.. సూర్యాపేటలో జనగర్జన సభలో అమిత్‌ షా క్లారిటీ..

| Edited By: Ravi Kiran

Oct 27, 2023 | 6:41 PM

సూర్యాపేటలో బీజేపీ ‘జనగర్జన సభ’ జరుగుతోంది. ఈ సభలో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా... బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుటుంబ పార్టీలని విమర్శించారు. కుటుంబ సంక్షేమం కోసమే.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు పనిచేస్తాయి ఎద్దేవా చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు అమిత్‌ షా.

Telangana Elections: బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం.. సూర్యాపేటలో జనగర్జన సభలో అమిత్‌ షా క్లారిటీ..
Amit Shah Suryapet
Follow us on

తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని తెలంగాణ సీఎంగా చేస్తామని ప్రకటించారు బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వల్ల తెలంగాణకు మేలు జరగదని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని అమిత్‌ షా అన్నారు.

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ జోరు పెంచింది. ఒక వైపు చేరికలు మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచే ప్రయత్నం చేసింది. సూర్యాపేటలో నిర్వహించిన జనగర్జన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వచ్చారు. BRS, కాంగ్రెస్‌ ఒక్కటేనన్న అమిత్‌ షా- గతంలో ఇచ్చిన హామీలపై కేసీఆర్‌పై ప్రశ్నలు గుప్పించారు. అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న మాట ఏమైందని కేసీఆర్‌ను అమిత్‌ షా ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే దళితులను సీఎంగా చేస్తామని చెప్పిన మాట ఏమైందని BRSను అమిత్‌ షా ప్రశ్నించారు.

తెలంగాణ మేలును BRS,కాంగ్రెస్‌ కోరుకోవడం లేదని, అవి తమ కుటుంబ మేలు కోసం పాటుపడే పార్టీలని అమిత్‌ షా ఆరోపించారు. ఆ పార్టీలకు పేదల సంక్షేమం పట్టదని అమిత్‌ షా అన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌, సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌ లక్ష్యం తెలంగాణ ప్రజల బాగుకాదు. కేటీఆర్‌ను సీఎం చేయాలన్నది కేసీఆర్‌ ఆలోచన, రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియా గాంధీ అనుకుంటున్నారు.

సూర్యాపేట ప్రజాగర్జన సభకు బయలుదేరడానికి ముందు తెలంగాణ బీజేపీ ముఖ్యనాయకులతో అమిత్‌ షా బేగంపేట ఎయిర్‌పోర్టులో సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. మరో వైపు BRSకు గురువారం రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే KS రత్నం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రత్నంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. SPOT

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి