Telangana Elections: ఎవరు ఎవరిని మోసం చేశారు.. ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేశా..

Telangana Elections: ఎవరు ఎవరిని మోసం చేశారు.. ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేశా..

Sanjay Kasula

|

Updated on: Oct 27, 2023 | 4:36 PM

CM KCR: మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, పాలేరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖమ్మంలో నువ్వు పార్టీకి చేసింది గుండు సున్నా. పైగా నేను మోసం చేశాను అని చెప్పుకుంటున్నాడు. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశార‌ని తుమ్మల‌పై కేసీఆర్ నిప్పులు చెరిగారు. పొంగులేటి, తుమ్మల డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు‌.

పాలేరు స‌భ‌లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తుమ్మల ఓడిపోయి మూల‌కు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశానన్నారు కేసీఆర్. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశార‌ని తుమ్మల‌పై కేసీఆర్ నిప్పులు చెరిగారు. పొంగులేటి, తుమ్మల డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు‌. పదవుల కోసం పార్టీలు మారే మన మధ్యే ఉన్నారని.. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. డబ్బు, అహంకారంతో వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వకూడదన్నారు. మద్యం, డబ్బుతో వచ్చే వారికి ఓటు వేయకుండా.. పార్టీల వైఖరిని పరిశీలించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 27, 2023 04:35 PM