Telangana: ఆ విషయంలో తెలంగాణకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..

|

Jul 21, 2021 | 7:42 AM

Telangana: తెలంగాణలో వ్యవసాయ సాగు పెరిగినందున.. అవసరమైన మేరకు ఎరువులను కేటాయించాలని కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవియాను..

Telangana: ఆ విషయంలో తెలంగాణకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..
Minister Niranjan Reddy
Follow us on

Telangana: తెలంగాణలో వ్యవసాయ సాగు పెరిగినందున.. అవసరమైన మేరకు ఎరువులను కేటాయించాలని కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవియాను రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రిని కలిసి సందర్భంలో మంత్రి నిరంజన్ రెడ్డి వెంట లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సురేష్ రెడ్డి, రాములు, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీరి భేటీలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా అంశంపై చర్చించారు. ఈ వానకాలం సీజన్‌కు 10లక్షల 50 వేల యూరియాను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందన్నారు. కేటాయించిన యూరియాను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నెలవారీగా సరఫరా చేస్తారు.జూన్, జులై నెలల సరఫరాలో 93 వేల మెట్రిక్ టన్నుల యూరియా లోటు సరఫరా ఉంది. ఈ అంశాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఇక ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు గాను దాదాపుగా నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని, లోటు సరఫరా ఉన్నదాన్ని కూడా కలిపి ఒకేసారి మొత్తం పంపించాలని కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి త్వరగా వచ్చే యూరియా కోటాలో తెలంగాణకు కేటాయింపులు చేయాలని కోరారు. సీజనల్ గా దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా నాట్లు పడతాయని, సీజనల్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగా తెలంగాణకి యూరియా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఆయన కోరారు. కాగా, తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రి మాన్‌సుఖ్ మండవియా అభినందించారని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఇబ్బంది రానివ్వమని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Also read:

‎Aha : అదిరిపోయే కంటెంట్‌‌‌‌తో దూసుకుపోతోన్న ఆహా.. త్వరలో మరో ఆసక్తికర సినిమాతో..

Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్‌ కప్‌లో డౌటే?

Earthquake: రాజస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు..