Munugodu: నికార్సైన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనాలనే బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొడతాం.. చౌటుప్పల్ లో మంత్రుల ఆందోళన..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేసిన చర్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా ఖండించారు. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మంత్రుల ఆధ్వర్యంలో ధర్నా..

Munugodu: నికార్సైన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనాలనే బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొడతాం.. చౌటుప్పల్ లో మంత్రుల ఆందోళన..
Ministers Protest In Choutuppal
Follow us

|

Updated on: Oct 27, 2022 | 6:49 AM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేసిన చర్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా ఖండించారు. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మంత్రుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. నికార్సైన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుష్ట చర్యలు, దుర్మార్గాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేతలు రాజ్యాంగం పట్ల అవహేళనగా ప్రవర్తిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా.. తెలంగాణలో మునుగోడులో బై పోల్ ఇష్యూలో పెను సంచలనం కలిగింది. ఎలక్షన్స్‌కి ముందు చేపట్టిన బిగ్ ఆపరేషన్ ఆకర్ష్.. పోలీసుల ఎంట్రీతో బ్లాస్ట్ అయ్యింది.

ఒకటి కాదు రెండు కాదు ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేయగా సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వారికి బిగ్ షాక్ ఇచ్చారు. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పొలిటికల్ బేరసారాలు జరిపిన రామచంద్రభారతి, నందూ, సింహయాజులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్‌ నేతలు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్హాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు.

అయితే ముందు నుంచే బీజేపీ కొనుగోళ్లు జరుపుతోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాన్ని నిజం అని చెప్పేలా టీఆర్ఎస్ నేతలు ఓ డ్రామా క్రియేట్ చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా గులాబీ పార్టీదే అని ప్రతివిమర్శలు చేస్తున్నారు. పోలీసులు కూడా బేరసారాలు జరుగుతున్నాయన్న సమాచారం తమకు వచ్చిందని, దీంతో తాము దాడులు చేశామంటున్నారు పోలీసులు. అసలు ఏం జరిగిందనేది తేల్చాల్సింది మాత్రం పోలీసులే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..