Telangana: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అన్ని గురుకుల పోస్టులకు నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే..!

|

Apr 30, 2023 | 12:43 PM

తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్లలో పరీక్షలను ఓఎంఆర్‌ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పటివరకూ..

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అన్ని గురుకుల పోస్టులకు నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే..!
TS Gurukul jobs
Follow us on

తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్లలో పరీక్షలను ఓఎంఆర్‌ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పటివరకూ ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షలకే ఏర్పాట్లు చేస్తూ వచ్చినప్పటికీ టీఎస్‌పీఎస్సీలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో బోర్డు ఆన్ లైన్ పరీక్షల వైపే మొగ్గుచూపుతోంది.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా ఈ విధానంలోనే నిర్వహించడంపై టీఆర్‌ఈఐఆర్‌బీ సాధ్యాసాధ్యాలపై ఆరా తీసోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానం అమలుకు రాష్ట్రంలో పరిమిత సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే గరిష్టంగా 32 వేల మంది మాత్రమే హాజరయ్యే వీలుంటుంది. గురుకుల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులుండటంతో ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాదని బోర్డు తొలుత భావించింది.

ఐతే ఒకే దఫా పరీక్షల నిర్వహణకు పోస్టులన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాకపోవడంతో విడివిడిగా పరీక్షల నిర్వహణ అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. టీజీటీ, పీజీటీ కేటగిరీలోనే 70 శాతం పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో 15 సబ్జెక్టులున్నాయి. అలాగే జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ కేటగిరీల్లోనూ సబ్జెక్టుల వారీగా పోస్టులున్నాయి. రెండు సబ్జెక్టులకు పరీక్ష రాసే అవకాశాలు తక్కువ. దీంతో ఒక్కో సబ్జెక్టు ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. గురుకుల ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మే 28 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు గడువు ముగిశాక అందే దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.