Telangana: వంటింట్లో ఘాటు లేపుతున్న పప్పు దినుసులు.. కిలో కందిపప్పు ధర ఏకంగా రూ.180

| Edited By: Srilakshmi C

Sep 25, 2023 | 1:15 PM

మొన్నటి వరకు కూరగాయల ధరలు మండిపోయాయి. ప్రస్తుతం పప్పు దినుసుల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు పెరిగినప్పుడు అధికంగా పప్పుదినుసులను వినియోగించారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కేసారి పప్పు దినుసుల ధరలు పెరిగిపోయాయి. సమారుగా 25 శాతానికిపైగా ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎప్పుడు అందుబాటులో ఉండే కంది పప్పు ధర కిలోకు 180 రూపాయాల వరకు పలుకుతుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం..

Telangana: వంటింట్లో ఘాటు లేపుతున్న పప్పు దినుసులు.. కిలో కందిపప్పు ధర ఏకంగా రూ.180
All Dal Prices Skyrocket In Telangana
Follow us on

కరీంనగర్, సెప్టెంబర్‌ 25: మొన్నటి వరకు కూరగాయల ధరలు మండిపోయాయి. ప్రస్తుతం పప్పు దినుసుల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు పెరిగినప్పుడు అధికంగా పప్పుదినుసులను వినియోగించారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కేసారి పప్పు దినుసుల ధరలు పెరిగిపోయాయి. సమారుగా 25 శాతానికిపైగా ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎప్పుడు అందుబాటులో ఉండే కంది పప్పు ధర కిలోకు 180 రూపాయాల వరకు పలుకుతుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. భారీగా వర్షాల కారణంగా పప్పుదినుసుల దిగుబడిపై ప్రభావం చూపింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పప్పుదినుసుల ధరలు మండిపోతున్నాయి. ఈ సమయానికి పప్పుదినుసల ధరలు తగ్గాలి. కానీ.. అమాంతం పెరిగిపోయాయి. సహజంగా కందిపప్పును అధికంగా వినియోగిస్తున్నారు. కంది పప్పు ఎప్పుడు వంద రూపాయాలలోపు ఉండేది. కిలోకు 70 నుంచీ 80 రూపాయాల వరకు మాత్రం మార్కెట్లో లభించేది. ఫిబ్రవరి నెలలో కొత్త పంట చేతికొచ్చే సమయానికి ఈ ధర ఉండేది. కానీ.. ఈసారి కొత్త పంట చేతికొచ్చే సమయానికి కిలోకు 120 నుంచీ మొదలైంది. ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. కిలోకు 180 రూపాయాల వరకు అమ్ముతున్నారు. ధరలు మరింత పెరుగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. కంది పప్పు తరువాత పెసర పప్పును అధికంగా వాడుతారు. పెసర పప్పు కూడా మొన్నటి వరకు కిలోకు 90 రూపాయాలు ఉంటే.. ఇప్పుడు 120 వరకు అమ్ముతున్నారు.

అదే విధంగా మినప పప్పు మొన్నటి వరకు కిలోకు 105 రూపాయాలు ఉంటే.. ఇప్పుడు 140 వరకు అమ్ముతున్నారు. దాదాపుగా 35 రూపాయల వరకు ధర పెరిగిపోయింది. ఇక శనగ పప్పు కూడా 70 నుంచి 90 రూపాయల వరకు పెరిగిపోయింది. ఈ నాలుగు పప్పులను ఎక్కువగా వాడుతుంటాం. కానీ.. నాలుగు పప్పుల ధరలు పెరిగిపోయాయి. ఒక్కసారి ధరలు పెరిగిపోవడంతో వినియోగం కూడా తగ్గింది. పప్పులో ఇతర కూరగాయలను కలిపి వంట చేస్తుంటారు. ఈసారి భారీ వర్షాల కారణంగా.. దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా కంది దిగుమతి చేసుకుంటాం. అయితే, అక్కడ భారీ వర్ణాల కారణంగా, దిగుబడి రాలేదు. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ధరలు పెరగడంతో బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా స్థానికంగా కూడా పప్పుదినుసులు సాగు గణనీయంగా తగ్గిపోయింది. మొత్తానికి పెరిగిన ధరలలతో సామాన్యుడు విల లాడుతున్నాడు. ఎన్నడూ లేని విధంగా పప్పుదినుసుల ధరలు పెరిగిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. అదేవిధంగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.