Telangana Congress: తెలంగాణపై కాంగ్రెస్ ‘వ్యూహం’.. గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ కీలక సమావేశం..

| Edited By: Ravi Kiran

Jun 27, 2023 | 7:34 PM

Telangana Congress News: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులేస్తోంది. టీకాంగ్రెస్‌ నేతలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోన్న ఏఐసీసీ, వ్యూహరచన చేయబోతోంది. అది కూడా ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో!. 

Telangana Congress: తెలంగాణపై కాంగ్రెస్ ‘వ్యూహం’.. గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ కీలక సమావేశం..
Telangana Congress
Follow us on

Telangana Congress News: తెలంగాణ రాజకీయం మొత్తం ఢిల్లీకి షిఫ్ట్‌ అవుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా హస్తిన బాటపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒకరి తర్వాత మరొకరు ఢిల్లీకెళ్లి మంత్రాంగం చేస్తున్నారు. టీబీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌లు రెండ్రోజులపాటు అధిష్టానంతో మంత్రాంగం నడిపితే, ఇప్పుడు టీకాంగ్రెస్‌ నేతలంతా ఢిల్లీకెళ్లి హైకమాండ్‌తో కీలక మీటింగ్‌కి రెడీ అయ్యారు. కర్నాటక గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్‌, అదే ఊపుతో తెలంగాణను కూడా కైవసం చేసుకునేందుకు అడుగులేస్తోంది. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒకవైపు చేరికలపై ఫోకస్‌ పెడుతూనే, ఇంకోవైపు గెలుపు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తోంది అధిష్టానం. ఏఐసీసీ పిలుపుతో ఇప్పటికే ఢిల్లీకెళ్లిన టీకాంగ్రెస్‌ ముఖ్యనేతలతో భేటీకానున్నారు రాహుల్‌ అండ్‌ ఖర్గే. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ, మల్లు రవి, మహేష్‌గౌడ్‌, సంపత్‌, సీతక్క, బలరాం నాయక్‌, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి పాల్గొననున్నారు.

ఎలాగైనాసరే ఈసారి తెలంగాణలో గెలుపు జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్‌. అందుకోసం గెలుపు మార్గాలను అన్వేషిస్తోంది. మెయిన్‌గా విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా ముందుకెళ్తామంటున్నారు జానారెడ్డి. కాంగ్రెస్‌ స్ట్రాటజీ మీటింగ్‌లో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపైనే చర్చ జరగనుంది. పార్టీలో అంతర్గత సమస్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపిక, నేతల మధ్య సమన్వయంపై మాట్లాడుకోనున్నారు. పెండింగ్‌ డీసీసీ అధ్యక్షుల నియామకం, పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆహువహులకు సర్దిచెప్పడంపైనా చర్చించనున్నారు. ఇక, కొత్తగా చేరుతోన్న నేతలతో ఆయా నియోజకవర్గాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేయాలో ఆలోచించనున్నారు. ముందే అభ్యర్ధులను ప్రకటించాలన్న కోమటిరెడ్డి ప్రతిపాదనపైనా చర్చించబోతోంది కాంగ్రెస్‌ స్ట్రాటజీ కమిటీ. మొత్తానికి ఇవాళ జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది ఏఐసీసీ. మరి, ఆ నిర్ణయాలు కాంగ్రెస్‌ని తెలంగాణలో గద్దెనెక్కిస్తాయోలేదో చూడాలి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఎన్నికల సన్నద్ధతపై జరిగే ఈ వ్యూహాత్మక సమావేశం మధ్యాహ్నం 12.00 నుంచి 2.00 వరకు ఏఐసిసి కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొననున్న తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ సెక్రెటరీలు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానా రెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్, మల్లు రవి, సంపత్, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, సీతక్క, వంశీ చంద్ రెడ్డి, చిన్నా రెడ్డి సహా టీపీసీసీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..