AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Addanki Dayakar: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశ..! ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వారికి ఛాన్స్..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆఖరి క్షణంలో మళ్లీ అద్దంకి దయాకర్‌కి నిరాశే ఎదురైంది. ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా.. అద్దంకి దయాకర్‌ కు మరోసారి చోటివ్వలేదు.. రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కి, మరొకటి.. బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌కి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.

Addanki Dayakar: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశ..! ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వారికి ఛాన్స్..
Addanki Dayakar
Shaik Madar Saheb
|

Updated on: Jan 17, 2024 | 5:06 PM

Share

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆఖరి క్షణంలో మళ్లీ అద్దంకి దయాకర్‌కి నిరాశే ఎదురైంది. ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా.. అద్దంకి దయాకర్‌ కు మరోసారి చోటివ్వలేదు.. రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కి, మరొకటి.. బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌కి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలాంటే.. మంగళవారం అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ కి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఫైనల్‌ అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం బుధవారం ప్రకటన విడుదల చేసింది.

ఈ మేరకు హైకమాండ్ బల్మూరి వెంకట్, బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కు ఫోన్లు కూడా చేసి సమాచారం అందించింది. రేపటితో నామినేషన్‌ గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ అధిష్టానం.. ఫోన్లు చేసి నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

కాగా.. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పలువురు పేర్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇవాళ మరోసారి రివ్యూ చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. ఫైనల్‌గా బల్మూరితోపాటు మహేష్‌కుమార్‌ గౌడ్‌కి చోటు కల్పించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు అద్దంకి దయాకర్ ఆశించారు. అక్కడ శ్యామేల్ కు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేదా ఇతర పదువులు ఇస్తామని అధిష్టానం అద్దంకి దయాకర్ కు హామీనిచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ కు ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ.. చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది. అయితే, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్