Adilabad Tiger Fear: హడలెత్తిస్తున్న బెబ్బులి.. హమ్మయ్య అనుకునేలోపే కాగజ్‌నగర్‌లో మరోసారి కనిపించిన పెద్దపులి..

చిక్కదు.. దొరకదు. కంటి నిండా కునుకు తీనీదు. ప్రజల కంట పడుతుంది.. భయంతో దడ పుట్టింస్తుంది. ఇదీ.. కాగజ్ నగర్ ప్రజలను వేదిస్తున్న టైగర్ టెన్షన్.

Adilabad Tiger Fear: హడలెత్తిస్తున్న బెబ్బులి.. హమ్మయ్య అనుకునేలోపే కాగజ్‌నగర్‌లో మరోసారి కనిపించిన పెద్దపులి..
Tiger

Updated on: Nov 19, 2022 | 8:45 AM

చిక్కదు.. దొరకదు. కంటి నిండా కునుకు తీనీదు. ప్రజల కంట పడుతుంది.. భయంతో దడ పుట్టింస్తుంది. ఇదీ.. కాగజ్ నగర్ ప్రజలను వేదిస్తున్న టైగర్ టెన్షన్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలల్లో టైగర్ టెన్షన్ కొనసాగుతుంది. కాగజ్ నగర్ లో అలజడి సృష్టించిన పులి.. వంజరీ పెద్దవాగు దగ్గర అడవిలోకి వెళ్లిందని భావించారు ఫారెస్ట్ అధికారులు. చివరిగా వంజరీ దగ్గర పెద్దపులి పాదముద్రలు కనిపిండంతో ఫారెస్ట్ లోకి వెళ్లిందని సర్చ్ ఆపరేషన్ కు బ్రేక్ ఇచ్చారు. ఇంతలోనే రాత్రి 10గంటల సమయంలో మరోసారి పెద్దపులి ప్రత్యక్షమైంది. కాగజ్‌నగర్ మండలం ఈద్గాం పరిసరాల్లో రైతు కంట పడింది. నజురుల్ నగర్, నాల్గో నెంబర్ మైలు రాయి నీటి కుంట దగ్గర పెద్దపులిని గుర్తించాడు రైతు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమచారం ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యక్షమైంది కనిపించకుండ పోయిన పులేనా? అని అనుమానిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. రైతు ఇచ్చిన సమాచారం తో నజురుల్‌ నగర్‌లో పెద్దపులి కోసం జల్లెడ పడుతున్నారు అటవిశాఖ అధికారులు.

వరుసగా కనిపిస్తున్న పెద్దపులులతో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగు పులులు తిరుగుతున్నాయని చెప్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు. పనులకు బయటకు వెళ్లలేక.. ఇంట్లో కంటి నిండా కునుకు తీయలేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాల ప్రజలు టైగర్స్ తో టెన్షన్ పడుతున్నారు. పెద్దపులి దాడిలో ఖానాపూర్ లో సిడాంలో ఓవ్యక్తి చనిపోగా.. దగేహాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పంజా విసింది.

ఖానాపూర్‌, సామెల అటవి ప్రాంతం నుండి బోంది అంకుసాపూర్ మీదుగా కాగజ్ నగర్ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగజ్ నగర్ టౌన్ లోని వినాయక గార్డెన్, శ్రీరాంనగర్, ద్వారక నగర్, బాలాజీ నగర్, కౌసం నగర్ టూ శివపురంలో పులి అలజడి సృష్టించింది. తర్వాత శివపురం రైల్వే ట్రాక్ దాటి వంజరీ వైపు వెళ్లింది. వంజరీ దగ్గర అదృష్యమైన పులి.. నజురుల్ నగర్ వద్ద ప్రత్యక్షమైన పులి రెండు ఒకటేనా? వేరువేరా? అనే కోణంలో గాలిస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..