Snake Bite: చెప్పుడు మాటలు విన్నారు.. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారు..!

Snake Bite: గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడమంటే ఇదే. రెండు మూడు ఇంజక్షన్‌లతో నయమైపోయే పరిస్థితి..

Snake Bite: చెప్పుడు మాటలు విన్నారు.. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారు..!
Follow us

|

Updated on: Mar 06, 2021 | 6:04 AM

Snake Bite: గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడమంటే ఇదే. రెండు మూడు ఇంజక్షన్‌లతో నయమైపోయే పరిస్థితి నుంచి అపరేషన్ వరకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం హిరాపూర్‌ జే గ్రామంలో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకెళితే.. 15 ఏళ్ల విద్యార్థిని చిక్రం ధైర్యవంతిని మూడు నెలల క్రితం పాము కాటేసింది. దాంతో అమ్మాయి తల్లిదండ్రు కంగారు పడ్డారు. రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అంతలో స్థానికులు కల్పించుకుని.. పెద్దాసుపత్రికి తీసుకెళ్తే అరిష్టమని, పాప ప్రాణాలతో వస్తుందో రాదో అనే అనుమానం విద్యార్థి తల్లిదండ్రుల్లో కలిగించారు. తెలిసిన నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్తే అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుందని కబుర్లు చెప్పాడు. తెలిసిన వ్యక్తే కదా ఆ వ్యక్తి మాటలు నమ్మి నాటు వైద్యుని వద్దకు పాపను తీసుకెళ్లారు. అప్పటి నుంచి నాటు వైద్యుని వద్దే చూపిస్తూ వచ్చారు.

సరైన చికిత్స అందకపోవడంతో పాముకాటు గాయం రోజు రోజుకూ పెద్దదవుతూ వచ్చింది. చివరకు ఇన్‌ఫెక్షన్‌ అయింది. అయినా ఏం కాదంటూనే ఇన్నాళ్లు గడిపేశారు. ఈ విషయం ప్రభుత్వ వైద్యాధికారులకు తెలిసింది. వెంటనే హిరాపూర్‌ జే గ్రామానికి వచ్చి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. నాటు వైద్యంతో వ్యాధులు నయం కావని, పాప ప్రాణాలకే ముప్పు ఉందని వాళ్లను నచ్చజెప్పారు. రోజుంతా వాళ్లతో మాట్లాడి అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు వాళ్ల అంగీకారంతో అమ్మాయిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి ప్రమాదాలు జరిగినా… జబ్బులు సోకినా నాటు వైద్యులను ఆశ్రయించ వద్దని, నేరుగా ప్రభుత్వాసుపత్రికి రావాలని గ్రామంలో అవగాహన కల్పించారు. మూఢ నమ్మకాలు, నాటు వైద్యంతో ప్రాణాలకే ముప్పు అని ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమెత మనోహర్ హితవు పలికారు. ముఖ్యంగా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు.

Also read:

Boy Propose to Girl: ప్లీజ్ నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటావా?.. అదిరిపోయే రిప్లై ఇచ్చిందిగా!.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న స్క్రీన్‌షాట్..

Earning from Garbage: మీకు ఈ విషయం తెలుసా?.. వ్యర్థాలతో డబ్బులే డబ్బులు.. ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ గ్రామం..!