మా పంట కొనేది ఎవరు రామచంద్రా..! “జల దీక్ష” చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా జొన్న రైతులు

Farmer Protests: ఇంత కాలం వరి ధాన్యం కొనుగోలుపై ఇబ్బందులను ఎదుర్కొన్న తెలంగాణ రైతులు.. ఇప్పుడు తాజాగా మొక్కజోన్న రైతులు ఆందోళనకు దిగుతున్నారు. పంటల కొగుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వినూత్న నిరసనలకు దిగుతున్నారు.

మా పంట కొనేది ఎవరు  రామచంద్రా..! జల దీక్ష చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా జొన్న రైతులు
Adilabad Maize Farmers
Follow us
Sanjay Kasula

|

Updated on: May 20, 2021 | 9:34 AM

ఆదిలాబాద్ జిల్లా జొన్న రైతులు ఆందోళన చేపట్టారు.  యాసంగిలో జొన్నలు పండించిన రైతులు చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జొన్న కొనుగోళ్ళకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని మండి పడుతున్నారు. మరోవైపు అకాల వర్షం తమ పంటను తడిపి ముద్ద చేస్తోందని అంటున్నారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ జొన్న రైతులు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామ సమీపంలోని పెద్దవాగులోకి అర్ధ నగ్నంగా జల దీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తాము పండించిన జొన్న పంటను కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.

కొద్ది రోజుల క్రితం అదే మండలంలోని పొచ్చెర గ్రామ రైతులు ప్రధాన రహదారిపై జొన్న కంకులను పోసి వాటికి నిప్పుపెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాము పండించిన జొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై నిరసన తెలిపారు దన్నుర్ గ్రామ రైతులు. ఖరీఫ్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలుగు మద్దతు ధరను ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఇప్పటికే నిర్ధేశిశిత లక్ష్యం మేరకు 50 శాతం పూర్తి చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : AP Assembly Budget 2021 Live: మొద‌లైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతోన్న గ‌వ‌ర్న‌ర్‌..

Tirumala: తిరుమలలో చిరుత సంచారం… సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు… ( వీడియో )

King Koti Hospital: కింగ్ కోటి ఆస్పత్రి నుంచి భారీగా కరోనా రోగులు జంప్…! అలా కాదంటోన్న సూపరింటెండెంట్‌