Vote for Note: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు.. కీలక ప్రకటన చేసిన న్యాయస్థానం..
Vote for Note: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన..
Vote for Note: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం నాడు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపిపంది. వాదనలు ధర్మాసనం.. రేవంత్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో అభియోగాల నమోదు కోసం విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ ఫిబ్రవరి 8న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వేం నరేందర్ రెడ్డిని గెలుపించుకునేందుకు అప్పటి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటు కోసం ఆయనకు రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా, ఇతర టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. కాగా, ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.
Also read: