Floods: ప్రాణాల మీదకు తీసుకొచ్చిన డ్రైవర్ తొందరపాటు.. ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులో ఇరుక్కుపోయిన ట్రాక్టర్‌.. చివరకు..

|

Jul 24, 2021 | 10:35 PM

Rain Floods: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వాగులు, వంకలు ఉంపొగ్గి ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చే చేరుతోంది. ఈ క్రమంలోనే...

Floods: ప్రాణాల మీదకు తీసుకొచ్చిన డ్రైవర్ తొందరపాటు.. ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులో ఇరుక్కుపోయిన ట్రాక్టర్‌.. చివరకు..
Tractor In Floods
Follow us on

Rain Floods: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వాగులు, వంకలు ఉంపొగ్గి ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చే చేరుతోంది. ఈ క్రమంలోనే కొన్ని గ్రామాల్లో వాగులు రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగు దాటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వాహనదారుల నిర్లక్ష్యం ప్రాణాల మీదకి తెస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఓవైపు వరద ఉధృతంగా ప్రవహిస్తోందని తెలిసినా లెక్క చేయకుండా ముందుకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అనుకుంట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే అటుగా ఓ ట్రాక్టర్‌ వస్తోంది. అయితే సదరు ట్రాక్టర్‌ డ్రైవర్‌ను నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేశాడో.. లేదా దాటేస్తానని ధీమాతో ఉన్నాడో తెలియదు కానీ. నీటిలో నుంచి ట్రాక్టర్‌ను పోనిచ్చాడు. దీంతో వరద ఉధృతికి ట్రాక్టర్‌ రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. ముందుకు వెళ్లని పరిస్థితి. నీటి ఉధృతి ఇంకొంచెం పెరిగినా ట్రాక్టర్‌ వాగులో కొట్టుకుపోయేలా ఉంది. దీంతో డ్రైవర్ అలాగే ఉండి పోయాడు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికుల సహాయంతో కలిసి వరద నీటిలో చిక్కుకున్న ట్రాక్టర్‌ను తాడుతో లాగి సురక్షితం బయటకు తీశారు. దీంతో డ్రైవర్‌ బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.

Also Read: Snake Drink Milk : పాలు తాగితే పాములు చనిపోతాయా..! నాగపంచమి రోజున నిజంగానే తాగుతాయా..?

Viral Video: బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుండగా.. హనుమాన్ చాలీసా పఠించిన యువతి.. వీడియో

VIRAL PHOTOS : ఇక్కడ మహాత్మాగాంధీకి ఆలయం నిర్మించారు.. ప్రతిరోజు పూజిస్తున్నారు..