Secunderabad Fire: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన.. మొదటి అంతస్థులో అస్థిపంజరం గుర్తింపు.. ఎవరిది..?

|

Jan 21, 2023 | 3:38 PM

సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్ బిల్డింగ్‌ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ అస్థి పంజరం కనిపించడం కలకలం రేపుతోంది. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో భవనం మొదటి అంతస్తు వెనుక...

Secunderabad Fire: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన.. మొదటి అంతస్థులో అస్థిపంజరం గుర్తింపు.. ఎవరిది..?
Deccan Mall
Follow us on

సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్ బిల్డింగ్‌ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ అస్థి పంజరం కనిపించడం కలకలం రేపుతోంది. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో భవనం మొదటి అంతస్తు వెనుక భాగంలో శిథిలాలు తొలగిస్తుండగా ఒక వ్యక్తి అస్థిపంజరాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన వసీం, జునైద్‌, జాహిద్ భవనంలో చిక్కుకుపోయారు. అయితే.. లభించిన అస్థిపంజరం ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది. నిన్న ( శుక్రవారం ) డ్రోన్ కెమెరాల ద్వారా ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. బిల్డింగ్‌ వెనుక వైపు రెండు డెడ్‌బాడీస్ ను కనుగొన్నారు. గంటల తరబడి మంటలు ఎగసిపడడంతో బిల్డింగ్‌ మొత్తం హీటెక్కింది. లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో డ్రోన్ కెమెరాలను పంపించారు. డ్రోన్ కెమెరాతో షూట్ చేయించగా.. రెండు డెడ్‌బాడీలు బిల్డింగ్‌ బ్యాక్ సైడ్ ఉన్నట్టు గుర్తించారు.

ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి డెక్కన్ మాల్ పరిసరాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని, భవనం ఒక్కసారిగా కూలిపోతే తీవ్రంగా నష్టపోతామని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాకే భవనాన్ని కూల్చేస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

అగ్ని ప్రమాద ఘటన ఎంతో బాధాకరం. ప్రమాదం జరిగిన తర్వాత పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలకు తెగించి మంటలార్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన సిబ్బందికి కృతజ్ఞతలు. జంట నగరాల పరిధిలో 15 నుంచి 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు ఉన్నాయి. నివాసాల మధ్య ఇవి ఉండటం ప్రమాదం. ఈ నెల 25న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, వరస క్రమంలో శిథిల భవనాలను తొలగిస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

ఇవి కూడా చదవండి

        – తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం