MLA Payal Shankar: నేను సేప్ గానే ఉన్నా.. కార్యకర్తలెవరు ఆందోళన చెందవద్దు..!

హైదరబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.

MLA Payal Shankar: నేను సేప్ గానే ఉన్నా.. కార్యకర్తలెవరు ఆందోళన చెందవద్దు..!
Mla Payal Shankar

Edited By:

Updated on: Oct 25, 2024 | 8:54 PM

తాను క్షేమంగానే ఉన్నానని కార్యకర్తలు, ఆత్మీయులు , అభిమానులు‌ ఎవరు ఆందోళన చెంద వద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వీడియో విడుదల చేశారు. హైదరబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి వద్ద ఎమ్మెల్యే వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుండి ఎమ్మెల్యే క్షేమంగా బయటపడ్డారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు‌ చేసుకుంది. ఈ విషయం తెలియగానే భారతీయ జనతా పార్టీ శ్రేణులు‌, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద ఘటనపై స్పందించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తాను క్షేమంగానే ఉన్నానంటూ ఓ వీడియో‌ విడుదల చేశారు. ఆదిలాబాద్ కు క్షేమంగా చేరుకున్నానని.. పత్తి కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనపై పత్తి రైతులతో మాట్లాడేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు ‌వెళ్తున్నానంటూ తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..