Telangana: అల్లం, వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా.? డైరెక్ట్‌గా యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే

Telangana: అల్లం, వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా.? డైరెక్ట్‌గా యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే

Ravi Kiran

|

Updated on: Oct 25, 2024 | 8:20 PM

ప్రతీ ఇంటి వంటగదిలోనూ అల్లం, వెల్లుల్లి పేస్టు ఉండాల్సిందే. అయితే మార్కెట్‌లో కొందరు కేటుగాళ్లు ఈ అల్లం, వెల్లుల్లి పేస్టును కూడా కల్తీ చేసేస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

హైదరాబాద్‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. లంగర్‌హౌస్‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. సుమారు 835 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ సీజ్ చేశారు. ఇక.. అనుమతి లేకుండా హీనా జింజర్‌, గార్లిక్‌ పేస్ట్‌ పేరుతో తయారు చేయడంతోపాటు ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌నే హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటల్స్‌, దుకాణాలకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తున్న ఇమ్రాన్‌ సలీమ్‌ అనే వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..