Bombay Blood Group: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్, జనగామలో ఓ వ్యక్తికి అత్యవసరం..

బాంబే బ్ల‌డ్ గ్రూప్‌... ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా త‌క్కువ మందికే తెలిసిన బ్ల‌డ్ గ్రూప్ మాత్ర‌మే కాదు, చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఉండే బ్ల‌డ్ గ్రూప్ కూడా. కానీ, తెలంగాణలోని ఓ వ్యక్తి ఇప్పుడు అత్యవసంర అయింది.

Bombay Blood Group: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్, జనగామలో ఓ వ్యక్తికి అత్యవసరం..
Bombay Blood Group
Follow us

|

Updated on: May 22, 2022 | 3:49 PM

బాంబే బ్ల‌డ్ గ్రూప్‌… ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా త‌క్కువ మందికే తెలిసిన బ్ల‌డ్ గ్రూప్ మాత్ర‌మే కాదు, చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఉండే బ్ల‌డ్ గ్రూప్ కూడా. కానీ, తెలంగాణలోని ఓ వ్యక్తి ఇప్పుడు అత్యవసంర అయింది. జనగాం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్న రోగికి అత్యంత అరుదైన బ్లడ్ అవసరం ఏర్పడింది. అది కాస్త నలుగురిలో, నలభై మందిలో ఉండే సాదాసీదా బ్లడ్ గ్రూప్ కాదండోయ్…క్షల్లో వుండే అరుదైన రక్తం బాంబే ఫినోటైప్ బ్లడ్ గ్రూప్ కి చెందిన రక్తం అత్యవసరమని జిల్లా ఆసుపత్రి వర్గాలు కోరాయి. క్యాన్సర్ నయం కోసం చికిత్స పొందుతున్న ఓ రోగికి ఈ రక్తం ఇచ్చే దాతల కోసం ఎదురుచూస్తున్నా వైనం ఇది. ఇదంతా టాలివుడ్ హిరో గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు చిత్రం చూసే వుంటారు. అందులో విలన్‌కి ఈ బ్లడ్ గ్రూప్ కల్గిన వ్యక్తి గుండె శస్త్ర చికిత్స చుట్టూ అల్లిన కథాంశం గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ వెంకటేశ్వర్లు దీనయాతన వేరే…

జనగాం జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ కి చెందిన పాలకొండ వెంకటేశ్వర్లు వృత్తి రీత్యా వైద్య శాఖలో నాల్గోవ తరగతి ఉద్యోగిగా గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఇటివల కాలంలో క్యాన్సర్ మహమ్మారి బయటపడింది. అయితే అందుకోసం చికిత్స తీసుకుకునేందుకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ సుగుణాకర్ రాజు పరీక్షించి వైద్య పరిక్షలు చేయించారు. వెంకటేశ్వర్లుకు రేడియేషన్ కిమో థెరపి వైద్యం అవరసరమని డాక్టర్లు నిర్దారించారు. కాగా రక్త పరీక్షలు చేస్తుండగా వెంకటేశ్వర్లు బ్లడ్ గ్రూప్ సరి చూడగా అరుదైన బ్లడ్ గ్రూప్ కి చెందిన బాంబే ఫినోటైప్ బ్లాడ్ అని తేలింది. దీంతో డాక్టర్లు, ల్యాబోరేటరీ సిబ్బంది కూడా విస్తుపోయారు. ఈ విషయం వెంకటేశ్వర్లు కుటుంబ సబ్యులకు చెప్పగా వారు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యుల రక్త నమూనాలను పరిక్షించగా వారిలో ఎవరికీ ఈ రకమైన బ్లడ్ గ్రూప్ కనిపించలేదు. దీంతో చేసేది లేక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ అధికారులకు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా విషయం ప్రజల్లోకి చేరే ప్రయత్నం చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

ఇప్పటి వరకు ఇన్నేళ్ల తన వయసులో తనది ఓ అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ అన్న విషయం తెలియదని చెబుతున్నాడు వెంకటేశ్వర్లు. ఇప్పడు తన ఆరోగ్య స్థితి బాగలేక పోవటంతో విషయం బయటపడిందన్నారు. దాతలెవరైనా ముందుకొచ్చిన తనను కాపాడాలని వెంకటేశ్వర్లు వేడుకుంటున్నారు. ఈ అరుదైన బ్లడ్ గురించి తెలిసిన వారేవరైనా వెంకటేశ్వర్లును కాపాడేందుకు సాయం చేయాలని, తిరిగి అతడు కొత్త జీవితం మొదలు పెట్టాలని కోరుకుద్దాం..