Hyderabad: మైత్రివనం సెంటర్లో రెచ్చిపోయిన వాహనదారుడు.. పోలీసులు ఆపారని బైక్‌కు నిప్పు పెట్టాడు..

|

Oct 03, 2022 | 9:34 PM

వచ్చింది రాంగ్ రూట్లో.. అదేమని అడ్డగించి ఫైన్ వేస్తే.. నాకే ఫైన్ వేస్తారా? అంటూ నానా హంగా చేశాడు ఓ ద్విచక్రవాహనదారుడు.

Hyderabad: మైత్రివనం సెంటర్లో రెచ్చిపోయిన వాహనదారుడు.. పోలీసులు ఆపారని బైక్‌కు నిప్పు పెట్టాడు..
Bike Fire
Follow us on

వచ్చింది రాంగ్ రూట్లో.. అదేమని అడ్డగించి ఫైన్ వేస్తే.. నాకే ఫైన్ వేస్తారా? అంటూ నానా హంగా చేశాడు ఓ ద్విచక్రవాహనదారుడు. అంతటితో ఆగకుండా తన వాహనాన్ని తానే తగులపెట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘ఆపరేషన్ రోప్’ పేరుతో ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే మైత్రివనం వద్ద రాంగ్ రూట్లో వస్తున్న అశోక్ అనే ద్విచక్ర వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారు. అతని బండికి ఫైన్ వేశారు. అయితే, తన బండి ఆపినందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు వాహనదారుడు అశోక్. కోపంతో పెట్రోల్ ట్యాంకును ఓపెన్ చేసి లైటర్‌తో నిప్పట్టించాడు. వాహనదారుడు ఆదిత్య ఎంక్లేవ్‌లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిప్పు పెట్టడంతో.. బైక్ తగులబడిపోయింది.

వెంటనే అలర్ట్ అయిన పోలీసులు మంటలను ఆర్పేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాహనదారుడిని స్టేషన్‌కి తరలించారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే మైత్రివనం కూడలి వద్ద ద్విచక్ర వాహనదారుడు చేసిన ఈ వింత ప్రవర్తనకు అక్కడి వారు షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు ఆందోళనకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి..