Telangana: ఈనెల 8న అతనికి ఎంగేజ్‌మెంట్‌.. అంతలోనే కుటంబ సభ్యులకు షాక్

ఈనెల 8వ తేదిన అతని నిశ్చితార్థం జరగనుంది. కానీ ఆ రోజు రాకుండానే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన గొనె లెనిన్ రెడ్డి (30) అనే వ్యక్తి కరీంనగర్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

Telangana: ఈనెల 8న అతనికి ఎంగేజ్‌మెంట్‌.. అంతలోనే కుటంబ సభ్యులకు షాక్
Death

Updated on: May 04, 2023 | 5:47 PM

ఈనెల 8వ తేదిన అతని నిశ్చితార్థం జరగనుంది. కానీ ఆ రోజు రాకుండానే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన గొనె లెనిన్ రెడ్డి (30) అనే వ్యక్తి కరీంనగర్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ మధ్యే అతనికి పెళ్లి సంబంధం కూడా కుదిరింది. 8వ తేదిన ఎంగేజ్‌మెంట్ జరుపుకోవాలని ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. మంగళవారం రోజున లెనిన్ తన ఇంటికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం తన తల్లి పద్మను ఫంక్షన్‌ కోసం గిర్నిబావికి తీసుకెళ్లాడు.

ఆ తర్వాత రాత్రి లెనిన్ ఇంట్లో ఉరేసుకున్నాడు. స్థానికులు తలుపులు బలవంతంగా విరగ్గొట్టి చూడగా.. అప్పటికే లెనిన్‌ మృతి చెందాడు. అయితే మృతుడి తండ్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతని సోదరుడు మల్లారెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. జీవితంపై విరక్తి కలుగుతోంది.. చావాలని అనిపిస్తోంది అమ్మను బాగా చూసుకో అన్నయ్య అని రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై నవీన్‌కుమార్‌ మృతదేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.