Dating App: ఆశగా అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న యువకుడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
Dating App: హోటల్ గదిలో అమ్మాయి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఓ యువకుడికి హైదరాబాద్ పోలీసులు ఊహించని ఝలక్ ఇచ్చారు.
Dating App: హోటల్ గదిలో అమ్మాయి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఓ యువకుడికి హైదరాబాద్ పోలీసులు ఊహించని ఝలక్ ఇచ్చారు. ఆపై జైలుకు తరలించి ఊచలు లెక్కబెట్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సుమంత్ హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నాడు. డేటింగ్ యాప్‌ల ద్వారా అమ్మాయిలతో తాను అమ్మాయిగా పరిచయం చేసుకునేవాడు. అలా పరిచయం అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి తన ముగ్గులోకి దించేవాడు. ఆపై వారి వ్యక్తిగత ఫోటోలు సేకరించి.. వాటితో వారిని బెదిరిస్తాడు. అలా వారిని లొంగిదీసుకుంటాడు. ఈ క్రమంలోనే ఓ యువతిని లొంగదీసుకునేందుకు సుమంత్ యత్నించాడు. ముందుగా యువతితో పరిచయం చేసుకున్నాడు.
ఆపై యువతిని మభ్యపెట్టి అర్థనగ్న ఫోటోలు సంపాదించాడు. ఆపై తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. తనతో గడపాలంటూ యువతిపై ఒత్తిడిపెంచాడు. లేదంటే ఫోటో బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో బెంబేలెత్తిపోయిన యువతి.. సుమంత్ డిమాండ్‌ను అంగీకరించింది. ఈ క్రమంలో సుమంత్ నగరంలోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేశాడు. యువతి కోసం హోటల్ రూమ్‌లో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే సదరు యువతి సుమంత్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుమంత్ ఉన్న హోటల్‌కు వెళ్లారు. ఓ గదిలో యువతి కోసం ఎదురు చూస్తున్న సుమంత్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, సుమంత్ ఇలా ఎంతో మంది అమ్మాయిలను, మహిళలను లొంగదీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also read: