Free Tax and Registration: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు..
Free Tax and Registration: తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది.
Free Tax and Registration: తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, పెట్రోల్‌తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గానీ, రోడ్డు ట్యాక్స్ గానీ కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. తొలి 2 లక్షల ఎలక్రిక్ట్ ద్విచక్ర వాహనాలకు 100 శాతం రోడ్ ట్యాక్స్ ఫ్రీ తో పాటు, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలతో పాటు, ఇతర వాహనాలకూ ఈ ఆఫర్ వర్తించనుంది. తొలి 20వేల మూడు చక్రాల వాహనాలు, తొలి 10వేల ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్ వాహనాలు, తొలి 5వేల ప్రైవేట్ కార్లు, 5వేల ఫోర్ వీలర్ వాహనాలకు ఉచిత రోడ్ ట్యాక్స్, ఫ్రీ రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుందని పేర్కొంది.
Also read:
Actress Pooja Hegde: న్యూడ్ ఫోటో పెట్టాలని కోరిన అభిమాని.. ఊహించని విధంగా ఫోటో పెట్టిన పూజా హెగ్డే..