AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Pooja Hegde: న్యూడ్ ఫోటో పెట్టాలని కోరిన అభిమాని.. ఊహించని విధంగా ఫోటో పెట్టిన పూజా హెగ్డే..

Actress Pooja Hegde: అక్కినేని నాగచైనత్య ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజా హెగ్డే అందరికీ సుపరిచతమే.

Actress Pooja Hegde: న్యూడ్ ఫోటో పెట్టాలని కోరిన అభిమాని.. ఊహించని విధంగా ఫోటో పెట్టిన పూజా హెగ్డే..
Shiva Prajapati
|

Updated on: Feb 04, 2021 | 2:00 AM

Share

Actress Pooja Hegde: అక్కినేని నాగచైనత్య ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజా హెగ్డే అందరికీ సుపరిచతమే. మహర్షి, అరవింద సమేత, దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘రాధే శ్యామ్’తో పాటు అక్కినేని అఖిల్ ‘బ్యాచ్‌లర్’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే, తెలుగునాట టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ అమ్మడు.. తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సైలెంట్ కౌంటర్ ఇచ్చింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో చాట్ చేస్తున్న సందర్భంగా పూజా హెగ్డేను ఓ అభిమాని తన నగ్న చిత్రాన్ని పెట్టాలంటూ కామెంట్ చేశాడు. దీనికి చాలా తెలివిగా స్పందించిన పూజా హెగ్డే.. తన పాదాలను ఫోటో తీసి పోస్ట్ చేసింది. ఇది చూసి సదరు అభిమాని కంగుతిన్నాడు. కాగా, ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. మరోవైపు పూజా హెగ్డే సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫోటో కోరిన నెటిజన్‌‌కు సైలెంట్‌గా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందంటూ కితాబిస్తున్నారు. కాగా, ఈ ఫోటోకి ముందు పూజ మరొకిన్ని ఫోటోలను కూడా తన అభిమానులతో పంచుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో ఉన్న ఫోటో, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్‌తో కలిసి దిగిన ఫోటో, మేకప్ లేకుండా ఉన్న ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను అమ్మడు తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Actress Pooja Hegde Share Her pic

Also read:

England Cricketers: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్లు.. ఆ నిర్ణయమే వీరి ఆగ్రహానికి కారణం..

MLA Challenge: అది నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తా.. విమర్శకులకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..