Hyderabad: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో నెలకొన్ని చిన్న వివాదం వ్యక్తి హత్యా యత్నం వరకూ దారితీసింది. వివరాల్లోకి వెళ్తే..
చాంద్రాయణగుట్టలో అల్లుడిపై మామ దాడి చేశాడు. ఈ ఘటనలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. చావు బతుకుల మధ్య ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇస్మాయిల్ అనే వ్యక్తి తన భార్యను తరచూ వేధిస్తున్నాడు. దీంతో కూతురు బాధను చూడలేని తండ్రి.. అల్లుడైపై దాడిచేసి.. గ్రానైట్ రాయితో తలపై మోదాడు. దీంతో ఇస్మాయిల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Reporter : Noor, Tv9 Telugu
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..